భారత స్టార్‌పేసర్ ఇషాంత్ శర్మ.. కివీస్ బ్యాట్స్‌మెన్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాడు. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. తొలి టెస్టు మూడో రోజు ఈ ఫీట్ అందుకున్నాడు లంబూ. రెండో రోజు న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో టామ్ బ్లండెల్, టామ్ లేథమ్, రాస్ టేలర్‌లను ఔట్ చేసిన ఇషాంత్.. మూడో రోజు సౌథీ, బౌల్ట్‌ను ఔట్ చేశాడు. మొత్తం 22.2 ఓవర్లు బౌలింగ్ చేసి 68 పరుగులతో ఐదు వికెట్లు తీశాడు. ఇప్పటివరకు ఇలా 11 సార్లు ఐదేసి వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా పేరు నమోదు చేసుకున్నాడు.
-
Ishant Sharma at Basin Reserve, Wellington.
— BCCI (@BCCI) February 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
2014 - 5-wicket haul ☑️
2020 - 5-wicket haul ☑️#TeamIndia #NZvIND pic.twitter.com/E3YLO1T1YZ
">Ishant Sharma at Basin Reserve, Wellington.
— BCCI (@BCCI) February 23, 2020
2014 - 5-wicket haul ☑️
2020 - 5-wicket haul ☑️#TeamIndia #NZvIND pic.twitter.com/E3YLO1T1YZIshant Sharma at Basin Reserve, Wellington.
— BCCI (@BCCI) February 23, 2020
2014 - 5-wicket haul ☑️
2020 - 5-wicket haul ☑️#TeamIndia #NZvIND pic.twitter.com/E3YLO1T1YZ
జహీర్ సరసన...
టెస్టుల్లో ఎక్కువసార్లు 5 వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జహీర్‌తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు ఇషాంత్. 11సార్లు ఐదు వికెట్లు తీయడానికి జహీర్ 92 మ్యాచ్‌లు ఆడితే.. అదే రికార్డు అందుకోడానికి లంబూ 97 మ్యాచ్‌లు తీసుకున్నాడు.
ఆటగాడు | మ్యాచ్‌లు | వికెట్లు | ఐదు వికెట్లు |
కపిల్ దేవ్ | 131 | 434 | 23 |
జహీర్‌ఖాన్ | 92 | 311 | 11 |
ఇషాంత్ శర్మ | 97 | 297 | 11 |
జవగళ్ శ్రీనాథ్ | 67 | 236 | 10 |
ఇర్ఫాన్ పఠాన్ | 29 | 100 | 7 |
వెంకటేశ్ ప్రసాద్ | 33 | 96 | 7 |
విదేశాల్లోనూ సత్తా...
విదేశాల్లోనూ ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు ఇషాంత్. ఈ రికార్డులో జహీర్‌ను అధిగమించాడు.
ఆటగాడు | మ్యాచ్‌లు | వికెట్లు | ఐదు వికెట్లు |
కపిల్‌దేవ్ | 66 | 215 | 12 |
అనిల్ కుంబ్లే | 69 | 269 | 10 |
ఇషాంత్ శర్మ | 60 | 199 | 9 |
భగవత్ చంద్రశేఖర్ | 26 | 100 | 8 |
జహీర్ ఖాన్ | 54 | 207 | 8 |
నిద్రలేకపోయినా...
కివీస్‌తో తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన ఇషాంత్.. మ్యాచ్ ముందు నిద్రలేమితో ఇబ్బందిపడ్డాడు. గాయం నుంచి కోలుకున్నాక ఫిట్నెస్ టెస్టు కోసం భారత్‌లోనే ఉండిపోయిన ఇతడు... మ్యాచ్‌కు 72 గంటల ముందే న్యూజిలాండ్‌కు పయనమయ్యాడు. సుదీర్ఘ ప్రయాణం వల్ల శరీరం తీవ్రంగా అలసిపోయిందని అతడు పేర్కొన్నాడు.
" మ్యాచ్ తొలిరోజు నా శరీరం చాలా ఇబ్బందిపెట్టింది. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ మ్యాచ్ కచ్చితంగా ఆడాలని చెప్పడం వల్ల జట్టు కోసం ఆడక తప్పలేదు. అయితే నా బౌలింగ్‌పై సంతృప్తికరంగా లేను. శుక్రవారం 40 నిమిషాలే నిద్రపోయా. అంతకుముందు రోజు పడుకుంది మూడు గంటలే. జెట్ లాగ్‌తో ఇబ్బంది పడుతున్నా. మంచి నిద్ర లభిస్తే శరీరం కూడా చెప్పినట్టు వింటుంది. మ్యాచ్‌లో బంతి రివర్స్ స్వింగ్ కావడం లేదు. అందుకే క్రాస్ సీమ్ కోసం ప్రయత్నించా" అని ఇషాంత్ తెలిపాడు.
ఓవర్‌నైట్ స్కోరు 216/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్.. 348 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్‌పై 183 రన్స్ ఆధిక్యం అందుకుంది.
-
That is it! New Zealand's innings folds for 348 and they take a lead of 183 runs. @ImIshant picks up his 11th five-wicket haul and is now 3 short of completing 300 dismissals in Test cricket #TeamIndia #NZvIND
— BCCI (@BCCI) February 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Details - https://t.co/lrVl5hObDT pic.twitter.com/PEhzQq8TCe
">That is it! New Zealand's innings folds for 348 and they take a lead of 183 runs. @ImIshant picks up his 11th five-wicket haul and is now 3 short of completing 300 dismissals in Test cricket #TeamIndia #NZvIND
— BCCI (@BCCI) February 23, 2020
Details - https://t.co/lrVl5hObDT pic.twitter.com/PEhzQq8TCeThat is it! New Zealand's innings folds for 348 and they take a lead of 183 runs. @ImIshant picks up his 11th five-wicket haul and is now 3 short of completing 300 dismissals in Test cricket #TeamIndia #NZvIND
— BCCI (@BCCI) February 23, 2020
Details - https://t.co/lrVl5hObDT pic.twitter.com/PEhzQq8TCe