హామిల్టన్‌లో జరుగుతున్న మూడో టీ20లో భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ రోహిత్ శర్మ.. అర్ధ శతకంతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఉన్నంతసేపు బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న రోహిత్.. 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెన్నెట్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
మిగతా వారిలో రాహుల్ 27, శివమ్ దూబే 3, కోహ్లీ 38, శ్రేయస్ అయ్యర్ 17, జడేజా 10, మనీశ్ పాండే 14 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్ మూడు వికెట్లు తీయగా, గ్రాండ్‌హోమ్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.