న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పరాజయం చెందింది. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డే సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ కోహ్లీసేనకు కొన్ని సలహాలు ఇచ్చాడు.
"రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్‌తో పాటు చాహల్నూ ఆడించాలి. వీరిద్దరితో బరిలోకి దిగితే మంచి ఫలితాలు రావచ్చు. కివీస్ బ్యాట్స్‌మెన్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కానీ స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం వారికి కొంచెం కష్టతరం. మిడిల్ ఓవర్లలో వికెట్లు సాధించాలంటే ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడం మంచిది. అవసరమైతే కేదార్ జాదవ్‌ను పక్కనపెట్టాలి."
-హర్భజన్ సింగ్, టీమిండియా క్రికెటర్
ప్రపంచకప్ తర్వాత కుల్దీప్, చాహల్ కలిసి ఆడలేదు. అప్పటి నుంచి ఎవరో ఒకరికి మాత్రమే తుదిజట్టులో చోటు దక్కుతోంది. కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో కేదార్ జాదవ్ బ్యాట్‌తో ఫర్వాలేదనిపించాడు. 15 బంతుల్లో 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరి తర్వాత మ్యచ్‌లో కేదార్‌ను తప్పించి చాహల్‌కు మేనేజ్మెంట్ అవకాశమిస్తుందో లేదో చూడాలి.
ఇవీ చూడండి.. ధోనీ బన్‌గయా పానీపూరి వాలా