భారత సారథి విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్లో మరో రికార్డుపై కన్నేశాడు. ఇంకో 25 పరుగులు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ (1,112) పేరిట ఈ రికార్డు ఉంది.
టాప్-4లో కోహ్లీ...
ప్రపంచంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ (1,148), దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ (1,273) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ధోనీ, కోహ్లీ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
>> మరోసారి హాఫ్ సెంచరీ సాధిస్తే.. టీ20ల్లో అత్యధిక సార్లు 50పై చిలుకు పరుగులు సాధించిన సారథిగా నిలుస్తాడు. ప్రస్తుతం డుప్లెసిస్, విలియమ్సన్తో కోహ్లీ సమంగా నిలిచాడు.
>> అత్యధిక సిక్సర్లు బాదిన సారథిగా నిలవడానికి కోహ్లీ ఏడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కోహ్లీ ఈ ఘనత అందుకునే అవకాశం ఉంది.
ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన. ఈ రోజు మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇప్పటివరకు కివీస్ గడ్డపై భారత్ పొట్టి ఫార్మాట్ కప్పు గెలవలేదు.