హామిల్టన్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న కోహ్లీసేన.. ఇందులోనూ గెలిచి, సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఈ టీ20 గెలిచి, రేసులో నిలవాలని చూస్తోంది కివీస్. మరి ఎవరూ విజయం సాధిస్తారో చూడాలి.
న్యూజిలాండ్ గడ్డపై భారత్.. ఇప్పటివరకు టీ20 సిరీస్ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలో 0-2 తేడాతో ఓటమి పాలైంది టీమిండియా. గతేడాది జరిగిన మూడు మ్యాచుల సిరీస్ 1-2 తేడాతో చేజారింది. ఇప్పుడు గెలిస్తే తొలిసారి గెలిచి, ఈ ఘనత సాధించిన జట్టుగా నిలుస్తుంది.
జట్లు
భారత్
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్‌శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, చాహల్, బుమ్రా, షమి, శార్దుల్ ఠాకుర్
న్యూజిలాండ్
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోదీ, టిమ్ సౌతీ