ETV Bharat / sports

తొలి టెస్ట్​: 39/1 వద్ద భారత్​- చివరి రోజు లక్ష్యం 381 - టీమ్​ఇండియా రెండో ఇన్నింగ్స్​ స్కోరు

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్​ఇండియా 381 పరుగుల వెనుకంజలో ఉంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్​లో వికెట్​ కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(12), గిల్​(15) ఉన్నారు.

pujara
పుజారా
author img

By

Published : Feb 8, 2021, 5:14 PM IST

Updated : Feb 8, 2021, 5:26 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్​ఇండియా గెలవాలంటే చివరి రోజు 381 పరుగులు చేయాలి. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్​లో వికెట్​ కోల్పోయి 39 పరుగులు చేసింది భారత్​.

ఇలా సాగింది..

ఓవరునైట్​ స్కోరు 257/6తో ఆటను కొనసాగించిన టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 337 పరుగులకు ఆలౌట్​ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఇంగ్లీష్​ జట్టును భారత బౌలర్లు దెబ్బతీశారు. ఫలితంగా 178 పరుగులకే కుప్పకూలిపోయి... భారత ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది ఇంగ్లాండ్. టీమ్​ఇండియా బౌలర్లలో అశ్విన్​ 6, నదీమ్​ 2, ఇషాంత్​ శర్మ, బుమ్రా తలో వికెట్​ దక్కించుకున్నారు.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన టీమ్​ఇండియాకు ఆదిలోనే షాక్​ తగిలింది. తొలి ఇన్నింగ్స్​లో నిరాశపరిచిన ఓపెనర్​ రోహిత్​ శర్మ.. రెండో ఇనింగ్స్​లోనూ జాక్​ లీచ్​ బౌలింగ్​లో కేవలం 12 పరుగులు చేసి ఔట్​ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పూజారా మరో వికెట్​ పడకుండా రోజు ముగించాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా(12), గిల్​(15) ఉన్నారు.

Last Updated : Feb 8, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.