రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ప్రదర్శన చేసిన రోహిత్... సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 43 బంతుల్లో 85 పరుగులు (6ఫోర్లు, 6 సిక్సర్లు) బాదేశాడు. తన ప్రదర్శనపై మ్యాచ్ అనంతరం సహఆటగాడు చాహల్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడిన హిట్‌మ్యాన్.. ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు.
"తొలి మూడు బంతులు సిక్సర్లుగా మలిచాక... మిగతా బంతుల్లోనూ సిక్స్‌లు బాదాలనుకున్నా. ఆ ప్రయత్నంలో నాలుగో బంతి మిస్సయ్యింది. ఇక సిక్సర్లు కాకుండా సింగిల్స్ కోసం చూశాను. పిచ్ పరిస్థితి చూశాక ఆఫ్ స్పిన్ పెద్దగా టర్న్ సాధించట్లేదని అర్థమైంది. అందుకే క్రీజులో ఉండే బంతిని గట్టిగా బాదాలని నిర్ణయించుకున్నా".
--రోహిత్‌శర్మ, టీమిండియా తాత్కాలిక కెప్టెన్
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్, ఆఫ్ స్పిన్నర్ మొసదెక్ హొస్సేన్ వేసిన 10వ ఓవర్లో తొలి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు రోహిత్. కానీ తర్వాత మూడు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి. ఫలితంగా ఒక్క ఓవరే వేసిన ఇతడు 21 పరుగులు సమర్పించుకున్నాడు.
-
MUST WATCH: Chahal TV with the Hitman! 😎
— BCCI (@BCCI) November 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
From @ImRo45's 100th T20I to his 'secret' recipe to those monster sixes, this fun segment of Chahal TV has all the answers! 😀 @yuzi_chahal - by @28anand
Full Video here 👉👉 https://t.co/tPJpO7yDMo pic.twitter.com/HgEZXGgroF
">MUST WATCH: Chahal TV with the Hitman! 😎
— BCCI (@BCCI) November 8, 2019
From @ImRo45's 100th T20I to his 'secret' recipe to those monster sixes, this fun segment of Chahal TV has all the answers! 😀 @yuzi_chahal - by @28anand
Full Video here 👉👉 https://t.co/tPJpO7yDMo pic.twitter.com/HgEZXGgroFMUST WATCH: Chahal TV with the Hitman! 😎
— BCCI (@BCCI) November 8, 2019
From @ImRo45's 100th T20I to his 'secret' recipe to those monster sixes, this fun segment of Chahal TV has all the answers! 😀 @yuzi_chahal - by @28anand
Full Video here 👉👉 https://t.co/tPJpO7yDMo pic.twitter.com/HgEZXGgroF
ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఓపెనర్ గిబ్స్ మాత్రమే వన్డేల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో మాత్రం టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. 2017 టీ20 ప్రపంచకప్‌లో ఈ ఫీట్ సాధించాడు.
హిట్‌మ్యాన్ రికార్డు..
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు రోహిత్. 17 ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు కొట్టాడు. ధోనీ 62 ఇన్నింగ్స్‌ల్లో 34 సిక్సర్లు, విరాట్ 26 ఇన్నింగ్స్‌ల్లో 26 సిక్సర్లు తర్వాతి స్థానంలో ఉన్నారు. టీ20ల్లో అత్యధిక సిక్సుల (115) రికార్డు రోహిత్ పేరిటే ఉంది.
గురువారం(నవంబర్ 7) జరిగిన మ్యాచ్‌లో బంగ్లా నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ రోహిత్‌శర్మ(85), శిఖర్ ధావన్(31; 27 బంతుల్లో 4సిక్సర్లు) ధాటిగా ఆడడం వల్ల భారత్ 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఇరుజట్ల మధ్య ఆఖరి మ్యాచ్ నాగపూర్ వేదికగా ఆదివారం జరగనుంది.