దిల్లీ వేదికగా టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న తొలి టీ20పై... వాయు కాలుష్యం ప్రభావం చూపే అవకాశముంది. అయితే రెండు జట్లు తలపడనున్న ఈ మ్యాచ్‌పై... బంగ్లా ప్రధాన కోచ్ రస్సెల్ డోమింగో మాట్లాడాడు. భారత రాజధానిలో పొగమంచు కారణంగా ఏర్పడిన ఈ కాలుష్యం తమను పెద్దగా షాక్‌కు గురిచేయలేదని ఆయన చెప్పాడు. దీని వల్ల ఎవరూ చనిపోరని అభిప్రాయపడ్డాడు. ఇదే తరహా పరిస్థితులు ఒక్కోసారి బంగ్లాదేశ్‌లోనూ ఏర్పడతాయని అన్నాడు.
" శ్రీలంక ఆటగాళ్లు ఈ వాతావరణం వల్ల గతంలో ఇబ్బందిపడ్డారని తెలుసు. అయితే నిజానికి ఇలాంటి కాలుష్య పరిస్థితి బంగ్లాదేశ్‌లోనూ కొంత వరకు ఉంది. ఇదేమి పెద్ద షాకింగ్‌గా అనిపించట్లేదు. క్రికెటర్లు ఆటపైనే దృష్టిపెడుతున్నారు. దీనిపై అంతగా ఫిర్యాదు చేయాల్సిన పనిలేదు. ఆట మూడు గంటల్లో ముగిసిపోతుంది. ఈ కాలుష్యం వల్ల కళ్లు మండటం, గొంతి నొప్ప వచ్చినా ఎవరూ చనిపోరు".
- రస్సెల్ డోమింగో, బంగ్లా ప్రధాన కోచ్
బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆల్ అమిమ్,రోనీ, సలహాదారుడు డేనియల్ వెటోరీ సైతం మాస్కులు ధరించి మైదానంలో ప్రాక్టీసులో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
గతంలో...
2017లో వాయు కాలుష్యం కారణంగా కొంతమంది లంక క్రికెటర్లు వాంతులు చేసుకోగా, మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. అది టెస్టు మ్యాచ్ కావడం వల్ల లంక క్రికెటర్లు ఐదు రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాధారణంగా శీతాకాలంలో దిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించవద్దనే డిమాండ్ ఉంది. అయితే రొటేషన్ పద్ధతి ప్రకారం ఈ వేదికను కేటాయించక తప్పడం లేదు. తర్వాత నుంచైనా బీసీసీఐ దీనిపై చర్యలు తీసుకోవాలని క్రికెట్ పండితులు సూచిస్తున్నారు.