ETV Bharat / sports

ఆస్ట్రేలియాxభారత్‌: ఆటగాళ్లకు మళ్లీ క్వారంటైన్‌ కష్టాలే! - india tour of australia 2020-21 venue

ఈ ఏడాది చివర్లో టెస్టు సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న టీమ్‌ఇండియా.. ముందుగా అనుకున్నట్లు తొలి మ్యాచ్​ను పెర్త్‌లో ఆడబోవట్లేదు. అడిలైడ్‌ లేదా బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్‌ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్​లో బయోబబుల్​లో ఉంటూనే కంగారూ దేశానికి వెళ్లినా.. మళ్లీ క్వారంటైన్​ కష్టాలు ఎదుర్కోనున్నారు ఆటగాళ్లు.

india vs australia test series in australia
ఆస్ట్రేలియా-భారత్‌: ఆటగాళ్లకు మళ్లీ క్వారంటైన్‌ కష్టాలు..!
author img

By

Published : Sep 8, 2020, 6:59 AM IST

కొవిడ్‌-19 ముప్పు నేపథ్యంలో క్రికెట్‌ టోర్నీలు నిర్వహించడం తలకు మించిన భారంగా మారుతోంది. ప్రభుత్వాల ఆంక్షలతో నిర్వహణ కష్టంగా తయారైంది. ఐపీఎల్‌-2020 ముగిశాక టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. పెర్త్‌లో మొదట మ్యాచులు నిర్వహించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా భావించింది. కాగా క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వలేమని వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేయడం వల్ల బ్రిస్బేన్‌ లేదా అడిలైడ్‌కు వేదికలను మార్చనుందని తెలిసింది.

బయోబబులోనే ఉన్నా...

పెరుగుతున్న వైరస్‌ కేసులతో ఎంసీజీ అందుబాటులో లేకపోతే డే/నైట్‌, బాక్సింగ్‌ డే సహా అన్ని టెస్టులు.. అడిలైడ్‌లోనే నిర్వహించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా భావిస్తోందట. ఐపీఎల్‌ తర్వాత భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు నేరుగా ఆస్ట్రేలియా చేరుకుంటారు.

ఆటగాళ్లంతా బయోబబుల్​లోనే ఉన్నా.. పూర్తిగా క్వారంటైన్‌కే అంకితమవ్వడం బీసీసీఐకి ఇష్టం లేదు. క్వారంటైన్‌లో ఉంటూనే సాధన చేసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని షరతు విధించింది. ఇందుకు వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించడం లేదు. సడలింపులు ఇవ్వలేమని, కట్టుదిట్టంగా క్వారంటైన్‌ ఆంక్షలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో షెడ్యూలును సవరించి విడుదల చేయాలని సీఏ భావిస్తోంది.

ఇదీ చూడండి: ఆర్చర్ బంతికి వార్నర్​కు దేవుడు గుర్తొచ్చాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.