టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మెన్ రిషభ్‌పంత్‌పై ఒత్తిడి లేకుండా వదిలేస్తే మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తాడని ఓపెనర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అందుకు భారత జట్టు కట్టుబడి ఉందని తెలిపాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన హిట్‌మ్యాన్.. పంత్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పాడు. అతడిని ఎంత వదిలేస్తే అంత బాగా రాణిస్తాడని అన్నాడు.
"మేం పంత్‌ను వదిలేశాం. తనకు ఇష్టమొచ్చినట్లు ఆడడానికి స్వేచ్ఛనిచ్చాం. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా అందుకు సిద్ధంగా ఉంది. అయితే, మీకొక ప్రశ్న వేయదల్చుకున్నా. మీరు పంత్ గురించి ఆలోచించకుండా ఉంటారా? అతడిని వదిలేస్తారా? అందుకు సిద్ధంగా ఉన్నారా?" అని రోహిత్ మీడియాను అడిగాడు. "అతడిని సహజసిద్ధమైన ఆట ఆడనివ్వండి. గతంలోనూ ఇదే విషయం చెప్పాను. ఇక నుంచి పంత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆసీస్, ఇంగ్లాండ్ జట్లపై మెరుగైన ప్రదర్శన చేశాడు. మీడియా ఒత్తిడి తప్ప పంత్‌ను మరేదీ ఆపలేదు" అని రోహిత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముందు వరకు పంత్ ఫామ్‌లేమి, షాట్ల ఎంపికలో తడబడ్డాడు. దీంతో చాలాకాలం సరైన ప్రదర్శన చేయలేక తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఐపీఎల్ తర్వాత అనూహ్యంగా కంగారూలతో టెస్టు సిరీస్ ఆడిన ఈ యువ క్రికెటర్ చెలరేగిపోతున్నాడు. అక్కడ సిరీస్ గెలిపించడమే కాకుండా, స్వదేశంలోనూ ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పుడీ యువ బ్యాట్స్‌మన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే మీడియా కూడా పంత్ విషయంలో అనవసరంగా కలగజేసుకోవద్దని రోహిత్ సూచించాడు.
ఇదీ చదవండి: 'కొత్త వారం, కొత్త ఫార్మాట్.. లక్ష్యం మాత్రం అదే'