టీమ్ఇండియా పేస్ బౌలింగ్ పూర్తి బలంగా ఉందని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొలాక్ చెప్పాడు. అదనపు బౌలర్ కోసం జట్టు ఇబ్బందిపడే రోజులు పోయాయని, బెంచ్ విభాగం కూడా బలంగా తయారైందని అన్నాడు. ఇటీవలే ఓ చాట్‌షోలో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నాడు.
"భారత జట్టు పేస్ విభాగం బలంగా తయారైంది. బౌలర్లు వివిధ నైపుణ్యాలతో రాణిస్తున్నారు. పొట్టి, పొడుగు కుర్రాళ్లు ఉండటం వల్ల జట్టు సమతూకంగా తయారైంది"
పొలాక్, దక్షిణాఫ్రికా మాజీ పేసర్
భారత జట్టులో ప్రస్తుతం బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ లాంటి వేగవంతమైన బౌలర్లు అద్భుతంగా అదరగొడుతున్నారు. వీరితో పాటు బెంచ్‌లో శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ తదితరులు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే ఒకప్పుడు భారత జట్టులోని శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ లాంటి పేసర్లకు మద్దతుగా అదనపు బౌలర్లు ఉండేవారు కాదని పొలాక్ గుర్తు చేసుకున్నాడు. ఇటీవలే బుమ్రాతో మాట్లాడిన ఇతడు.. టీమ్ఇండియా బౌలర్ల మధ్య పోటీతత్వం పెరిగినట్లు పేర్కొన్నాడు. భారత్‌కు ఇది మంచి అవకాశమని అన్నాడు.
ఇదీ చూడండి:గణితంపై అవగాహనే లక్ష్యంగా 'క్రికెట్-మ్యాథ్'