ETV Bharat / sports

టీమ్​ఇండియాకు ఈ రెండు సిరీస్​లు కీలకం!

author img

By

Published : Dec 16, 2020, 6:46 PM IST

ప్రస్తుతం జరగనున్న ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​తో పాటు ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో జరగబోయే సిరీస్​ కూడా టీమ్​ఇండియాకు చాలా కీలకం. ఇందులోని మ్యాచ్​ల్లో సగానికిపైగా గెలవాల్సి ఉంటుంది.

India need to do well against Aussies and England as WTC final race heats up
టీమ్​ఇండియాకు ఈ రెండు సిరీస్​లు కీలకం!

వచ్చే ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్​లు మరింత రసవత్తరంగా మారాయి. తొలి రెండు స్థానాల కోసం జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే తుదిపోరుకు అర్హత సాధించాలంటే రాబోయే మ్యాచ్​లు కోహ్లీసేనకు ఎంతో కీలకం. తొలి రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, భారత్ మధ్యో పోటీ తీవ్రంగా ఉండటమే ఇందుకు కారణం.

స్వల్ప ఆధిక్యంలో ఆసీస్​

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా(114 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా(116.46) అగ్రస్థానంలో.. ఆ తర్వాత న్యూజిలాండ్​ (116.37) ఉంది. ఇటీవలే వెస్టిండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​లో కివీస్​ జట్టు విజయం సాధించి, టేబుల్​లో రెండో స్థానంలోని టీమ్​ఇండియాను వెనక్కి నెట్టి ఆ ప్లేస్​కు చేరింది.

కివీస్​కు ఛాన్స్​

ఈనెల 26 నుంచి పాకిస్థాన్​, న్యూజిలాండ్​ మధ్య టెస్టు సిరీస్​ మొదలు కానుంది. ఇందులో 2-0 తేడాతో కివీస్​ గెలిస్తే ర్యాంకింగ్స్​లో ఆ జట్టు అగ్రస్థానానికి చేరుతుంది. మరోవైపు టీమ్​ఇండియా ఈ జాబితాలో టాప్​లోకి వెళ్లాలంటే రాబోయే ఎనిమిది టెస్టుల్లో ఐదు లేదా నాలుగు విజయాలతో పాటు మూడింటిలో డ్రా కావాలి.

ఏదైనా జరగొచ్చు!

"ఆస్ట్రేలియా, భారత్​ సిరీస్​తో పాటు.. న్యూజిలాండ్​, పాకిస్థాన్​ సిరీస్​ను బట్టి ర్యాంకులు తారుమారు కానున్నాయి. అయితే ఈ పోటీలో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని నిలుపుకోవచ్చు లేదా న్యూజిలాండ్​ టాప్​నకు చేరొచ్చు" అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

కరోనా కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం గతంలో పాయింట్ల పద్ధతిని పక్కన పెట్టి.. ర్యాంకులను, విజయాల శాతం ఆధారంగా నిర్ణయిస్తూ ఇటీవలే అనూహ్య నిర్ణయం తీసుకుంది ఐసీసీ. దీని వల్ల భారత్​ పాయింట్లు ఎక్కువ ఉన్నప్పటికీ అప్పుడు పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.

ఇదీ చూడండి: పంత్​కు నిరాశ.. గులాబీ టెస్టులో దక్కని చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.