ETV Bharat / sports

క్లీన్​స్వీప్​ కోసం కివీస్.. పరువు కోసం కోహ్లీసేన - kane williamson

భారత్-న్యూజిలాండ్​ మధ్య మూడో వన్డే.. మౌంట్ మాంగనూయ్ వేదికగా నేడు జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

క్లీన్​స్వీప్​ కోసం కివీస్.. పరువు కోసం కోహ్లీసేన
విరాట్ కోహ్లీ
author img

By

Published : Feb 11, 2020, 5:01 AM IST

Updated : Feb 29, 2020, 10:36 PM IST

న్యూజిలాండ్‌ పర్యటనలో వారం రోజుల ముందు టీ20 సిరీస్‌ను 5-0తో ఊడ్చేసిన భారత్‌... ఇప్పుడు వన్డే సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌కు గురయ్యే ప్రమాదంలో ఉంది. విచిత్రం ఏంటంటే? ఆతిథ్య జట్టును టీమిండియా ఎక్కడైతే క్లీన్‌స్వీప్‌ చేసిందో కథ మళ్లీ అక్కడికే చేరుకుంది. మరి పరుగుల వరద పారే మౌంట్‌ మాంగనూయ్‌లో మంగళవారం కోహ్లీసేన నిలిచేనా? చివరి మ్యాచ్‌ నెగ్గి పరువు నిలుపుకునేనా? లేదో చూడాలి.

newzeland cricket ground
మౌంట్ మాంగనూయ్ మైదానం

వారం రోజుల్లో పరిస్థితి అటుఇటైంది. వరుస విజయాలతో జైత్రయాత్ర సాగించిన కోహ్లీసేన.. హఠాత్తుగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. తిరుగులేదనుకున్న జట్టు.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ తప్పిదాలతో వన్డే సిరీస్‌లో 0-2తో వెనకబడి నిరాశపరిచింది. ఆఖరి వన్డేలోనైనా గెలిచి క్లీన్‌స్వీప్‌ తప్పించుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సిరీస్‌లో రోహిత్‌శర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ధావన్‌ లేడు. కీపింగ్‌ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌ ఐదో స్థానానికి వెళ్లాడు. కొత్త ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌ శుభారంభం అందిస్తున్నా, భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నారు. పరుగుల భారమంతా సారథి కోహ్లీపైనే పడింది. కివీస్‌ బౌలర్లు అతడు ఎక్కువ పరుగులు చేయకుండా విజయవంతంగా అడ్డుకోవడం వల్ల అర్థంకాని పరిస్థితి నెలకొంది.

shreyas iyer
భారత బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్

వన్డే సిరీస్‌లో టీమిండియా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పేలవంగా ఉన్నాయి. జస్ప్రీత్‌ బుమ్రా త్వరగా లయ అందుకోవాల్సి ఉంది. గాయపడ్డ తర్వాత అతడి బౌలింగ్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. బంతి, బ్యాటుతో ఆకట్టుకున్న నవదీప్‌ సైనీకి తిరుగులేదు. అయితే కుల్‌దీప్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో నిరాశపరుస్తున్నాడు. చివరి మ్యాచ్​లో అతడికి చోటు కష్టమే. భీకరంగా విజృంభిస్తున్న రాస్‌టేలర్‌ను అడ్డుకోవడంపైనే టీమిండియా గెలుపోటములు ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు.

న్యూజిలాండ్‌ జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలన్న పట్టుదలతో ఉంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ రావడంతో ఆ జట్టు బలం మరింత పెరిగింది. ఓపెనర్లు గప్తిల్‌, నికోల్స్‌ శుభారంభాలు ఇస్తున్నారు. అంతా బాగుంటే ఆతిథ్య జట్టులో ఒక్క మార్పుకు మించి ఉండకపోవచ్చు.

New Zealand team
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు

మౌంట్‌ మాంగనూయ్‌లో పరుగుల వరద ఖాయమే. పిచ్‌ స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలిస్తుంది. చివరి ఐదు వన్డేల్లో వారు 80 వికెట్లు తీశారు. 2019లో టీమిండియా ఇక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలవడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు ఇక్కడ 10 వన్డేలు జరగ్గా తొలుత బ్యాటింగ్‌ చేసినవి, ఛేదించినవి చెరో ఐదు గెలిచాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Belgrade, Serbia - 10 January 2020
1. Mid of Luigi Di Maio, Italian Foreign Minister, arriving and being greeted by Serbian President Aleksandar Vucic and Serbian officials
2. Various of the beginning of the meeting
3. Close of Luigi Di Maio, Italian Foreign Minister
4. Wide of Di Maio during meeting, alongside officials
5 . Wide of meeting
5. Close of Serbian President Aleksandar Vucic during the meeting
6. Various of the meeting
STORYLINE:
Italian Foreign Minister Luigi Di Maio met with Serbian President Aleksandar Vucic on Monday.
Di Maio is also due to meet with Serbian Prime Minster Ana Brnabic and Foreign minister Ivica Dacic.
The visit comes during a time of crisis for Serbia, as its population shrinks at an increased rate.
The issue has been pinned as a national emergency, and the United Nations has stepped in to help.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 29, 2020, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.