ETV Bharat / sports

సన్నాహక మ్యాచ్​లో కివీస్​కు బదులిస్తున్న టీమిండియా - bcci news

న్యూజిలాండ్​తో జరుగుతోన్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్​లో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. బౌలింగ్​లోనూ, బ్యాటింగ్​లోనూ కివీస్​కు దీటుగా బదులిస్తున్నారు.

India-lead-by-87-runs-against-New-Zealand-XI-in-Practice-Match
సన్నాహక మ్యాచ్​లో కివీస్​కు బదులిస్తున్న టీమిండియా
author img

By

Published : Feb 15, 2020, 4:44 PM IST

Updated : Mar 1, 2020, 10:43 AM IST

న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరుగుతోన్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో భారత్‌ పేసర్లు మెరిశారు. షమి (3/17), బుమ్రా (2/18), ఉమేశ్‌ యాదవ్‌ (2/49), సైని (2/58) సత్తా చాటడం వల్ల కివీస్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌లో హెన్రీ కూపర్‌ (40), రచిన్‌ రవీంద్ర (34), డారిల్‌ మిచెల్‌ (32) పరుగులు చేశారు. అనంతరం బరిలోకి దిగిన భారత ఓపెనర్లు పృథ్వీషా (35*), మయాంక్ అగర్వాల్‌ (23*) రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 87 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 263 పరుగులు చేసింది.

India-lead-by-87-runs-against-New-Zealand-XI-in-Practice-Match
సన్నాహక మ్యాచ్​లో మూడు వికెట్లు షమి

ఇటీవల కివీస్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వికెట్‌ లేకుండా ముగించిన బుమ్రా సన్నాహక మ్యాచ్‌లో రాణించాడు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు షమి సత్తా చాటాడు. అంతేకాక తొలి ఇన్నింగ్స్‌లో ఆదిలోనే ఔటైన పృథ్వీ షా, మయాంక్‌ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. బౌండరీలు బాదుతూ వేగంగా పరుగులు సాధిస్తున్నారు.

ఇదీ చూడండి.. భారత 'బోల్ట్'​కు శాయ్​లో శిక్షణ.. ఒలింపిక్స్​ కోసమేనా!

Last Updated : Mar 1, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.