ETV Bharat / sports

కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్​.. ఇంగ్లాండ్ లక్ష్యం 157

author img

By

Published : Mar 16, 2021, 8:44 PM IST

Updated : Mar 16, 2021, 8:53 PM IST

మూడో టీ20లో టీమ్​ఇండియా 157 పరుగులు చేసింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్.. ఆదిలో తడబడింది. కష్ట సమయంలో భారత్​ను కెప్టెన్ కోహ్లీ ఆదుకున్నాడు. ఇంగ్లాండ్​ బౌలర్లలో మార్క్​ వుడ్​ 3 వికెట్లు తీసుకున్నాడు.

india innings in third t20
కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్​.. ఇంగ్లాండ్ లక్ష్యం 157

భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న మూడో టీ20లో.. టీమ్​ఇండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆది నుంచి తడబడిన భారత జట్టును.. కోహ్లీ(77*) కెప్టెన్​ ఇన్నింగ్స్​తో ఆదుకున్నాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్​లో 27వ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు విరాట్.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోహ్లీ సేన.. ఆరంభం నుంచి తడబడింది. బౌలింగ్​కు సహకరిస్తున్న పిచ్​పై ఇంగ్లాండ్​ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్​ మార్క్ వుడ్ 3 వికెట్లు తీసుకున్నాడు.

కేఎల్​ రాహుల్​ మరోసారి డకౌట్​గా వెనుదిరిగాడు. రిషభ్​, కోహ్లీల జోడీ నాలుగో వికెట్​కు 40 పరుగులు చేసింది. ఆ తర్వాత లేని పరుగు కోసం ప్రయత్నించి పంత్ రనౌట్​గా పెవిలియన్ చేరాడు. కనీసం పోరాడే స్కోరైనా భారత్​ సాధిస్తుందా? అన్న అనుమానం రేకేత్తిన సమయంలో కెప్టెన్ కోహ్లీ చేలరేగాడు. మార్క్​ వుడ్​ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్స్​లతో పాటు ఓ ఫోర్​ సాధించాడు. చివరి 5 ఓవర్లోనే భారత్ 69 పరుగులు చేసింది.

ఇదీ చదవండి: టోక్యో ఒలింపిక్స్​కు మరో భారత అథ్లెట్ క్వాలిఫై​

Last Updated : Mar 16, 2021, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.