ETV Bharat / sports

పింక్​ టెస్ట్​: రోహిత్​ అర్ధసెంచరీ.. టీమ్​ఇండియా 99/3

author img

By

Published : Feb 24, 2021, 10:16 PM IST

Updated : Feb 24, 2021, 10:51 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు మొదటి ఇన్నింగ్స్​లో భారత్​ మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఆధిక్యానికి 14 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో రోహిత్​ శర్మ, అజింక్య రహానె ఉన్నారు. స్పిన్నర్లు చుట్టేయగా ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 112 పరుగులకే ఆలౌటైంది.

india first innings score in first day in pink test
పింక్​ టెస్ట్​: రోహిత్​ అర్ధసెంచరీ.. టీమ్​ఇండియా 99/3

అహ్మదాబాద్​ వేదికగా జరుగుతున్న డే/నైట్​ టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్​ తొలి ఇన్నింగ్స్​లో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్​ శర్మ(57), అజింక్య రహానె(1) ఉన్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో లీచ్​ 2 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యానికి భారత్​.. 14 పరుగుల దూరంలో ఉంది.

అంతకుముందు ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 112 పరుగులకే ఆలౌటైంది. హోంగ్రౌండ్​లో అక్షర్​ 6 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్​ 3 వికెట్లు తీసుకున్నాడు.

భోజన విరామ సమయానికి 5/0తో ఉన్న టీమ్​ఇండియా 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుభ్​మన్​ గిల్..​ ఆర్చర్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఛెతేశ్వర్​ పుజారా నిరాశపర్చాడు. లీచ్​ బౌలింగ్​లో డకౌట్​గా పెవిలియన్​ చేరాడు. తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన కెప్టెన్​ కోహ్లీ.. రోహిత్​కు చక్కని సహకారం అందించాడు. ఎడాపెడా బౌండరీలు బాదిన హిట్​మ్యాన్​ 63 బంతుల్లో హాఫ్​సెంచరీకి చేరుకున్నాడు. టెస్టుల్లో అతడికిది 12వ అర్ధసెంచరీ.

అయితే.. మరో 5 నిమిషాల్లో మ్యాచ్​ ముగుస్తుందనగా జాక్​ లీచ్​ బౌలింగ్​లో విరాట్​ బౌల్డయ్యాడు. మూడో వికెట్​కు ఈ జంట 64 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.

రోహిత్​, రహానె మరో వికెట్​ పడకుండా జాగ్రత్తపడ్డారు.

ఇదీ చదవండి: 'ఇప్పుడెలా ఉంది కెవిన్ భయ్యా'​

Last Updated : Feb 24, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.