ETV Bharat / sports

ప్రేక్షకులు లేకుండానే ఇంగ్లాండ్​తో తొలి రెండు టెస్టులు - చెన్నై

స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. కొవిడ్ నేపథ్యంలో క్రికెటర్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘం ఈ మేరకు నిర్ణయించాయి.

India-England Tests in Chennai to be played behind closed doors

author img

By

Published : Jan 22, 2021, 10:35 PM IST

చెన్నై వేదికగా ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడంలేదని తమిళనాడు క్రికెట్ సంఘం(టీఎన్​సీఏ) కార్యదర్శి రామస్వామి తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన శుక్రవారం వెల్లడించారు.

భారత్​లో ఇంగ్లాండ్​ పర్యటన ఫిబ్రవరి 5 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ప్రారంభంకానుంది. దానితో పాటు ఫిబ్రవరి 13న మొదలయ్యే రెండో మ్యాచ్​ కూడా చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలోనే జరగనుంది.

"తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం."

-ఆర్​ఎస్​ రామస్వామి, టీఎన్​సీఏ కార్యదర్శి.

ఈ విషయమై జనవరి 20నే టీఎన్​సీఏ సభ్యులకు ఓ సర్క్యూలర్​ పంపించారు. ప్రేక్షకులను అనుమతించరాదనే నిర్ణయాన్ని బీసీసీఐతో కలిసి తీసుకున్నారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో క్రికెటర్ల భద్రతపై ఎలాంటి రిస్క్​ తీసుకోదలచుకోవడం లేదని బీసీసీఐ అందులో స్పష్టం చేసింది.

జనవరి 27 కల్లా ఇరు జట్లు చెన్నై చేరుకోనున్నాయి. క్రికెటర్లు బయోబబుల్​లోకి వెళ్లే ముందు కరోనా పరీక్షలు జరుపుతారు.

ఇదీ చూడండి: భారత పర్యటనకు ఇంగ్లాండ్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.