ETV Bharat / sports

భయపడకమ్మా హర్మన్​.. నీ ఆట చూసేందుకే వచ్చా! - IndVsAus

అమ్మ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ధైర్యం, మరో దైవం. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవడం, వారి ఆలనా పాలనా చూసుకోవడమే ఆమెకు కాలక్షేపం. అయితే కన్నబిడ్డలు ఒత్తిడిలో ఉన్న సమయంలో ధైర్యమిచ్చేది ఆమెనే. అందుకే ప్రపంచకప్​లో ఫైనల్​ ఆడనున్న టీమిండియా హర్మన్​కు.. నేనున్నానంటూ దేశాలు దాటి వెళ్లింది తన తల్లి సతీందర్​ కౌర్​. తొలిసారి హర్మన్​ ఆటను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించనుంది.

India Captain Harmanpreet Kaur Mother will watch Women's T20 World Cup Final at MCG
'భయపడకమ్మా హర్మన్​.. నీ ఆట చూసేందుకు వస్తున్నా'
author img

By

Published : Mar 8, 2020, 9:13 AM IST

మహిళల టీ20 ప్రపంచకప్​ ముద్దాడేదెవరో తెలిసేందుకు కొన్ని గంటల సమయమే ఉంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎంతో మంది క్రికెటర్ల ఆశ.. ఆస్ట్రేలియా గడ్డపై​ ఆ ట్రోఫీని ముద్దాడాలని భావిస్తోంది భారత్. పొట్టి ప్రపంచకప్​లో తొలిసారి ఫైనల్​కు​ చేరిన టీమిండియా.. నాలుగు సార్లు ఛాంపియన్​ ఆస్ట్రేలియాతో నేడు తలపడనుంది. భారత జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న హర్మన్​కు ఈ రోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ప్రపంచ మహిళా దినోత్సవమే కాకుండా ఆమె పుట్టినరోజు కావడం. అందుకే ఈ విజయం ఆమెకే కాదు దేశానికి ఎంతో ప్రత్యేకం.

  • Today, on International Women's Day and her birthday, Harmanpreet Kaur will attempt to lead India to a first women's World Cup title in front of a packed MCG, with her parents watching live for the first time.

    No pressure!#T20WorldCup | #FILLTHEMCG pic.twitter.com/W4oSow4hh2

    — T20 World Cup (@T20WorldCup) March 8, 2020 +" class="align-text-top noRightClick twitterSection" data=" +"> +

ఇలాంటి ప్రముఖమైన ఫైనల్​​లో హర్మన్​ ఆటను చూసేందుకు తొలిసారి దేశాలు దాటి ఆస్ట్రేలియాకు వెళ్లింది హర్మన్​ తల్లి సతీందర్​ కౌర్​. గెలుపైనా, ఓటమైనా వెన్నంటి నిలిచేందుకు నేనున్నా అంటూ అభయమిచ్చింది.

India Captain Harmanpreet Kaur Mother will watch Women's T20 World Cup Final at MCG
తల్లి సతిందర్​ కౌర్​తో హర్మన్​

కుటుంబంతో హర్మన్​

భారీ జనసందోహం మధ్య

మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతుంటే స్టేడియంలో చాలా స్టాండ్స్‌ ఖాళీగా కనిపించడం సర్వసాధారణం. అయితే నేటి ఫైనల్​లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. అతి పెద్ద స్టేడియం మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​ (ఎంసీజీ) నిండుగా దర్శనమివ్వబోతోంది. మ్యాచ్‌ సమయంలో 90 వేలమందికి పైగానే స్టేడియంలో ఉంటారని అంచనా. ఇంతమంది ముందు మ్యాచ్‌ ఆడటం అమ్మాయిలకు కొత్త అనుభవమే. ఇదే వేదిక.. 1988లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చింది. అప్పుడు ఇంగ్లాండ్‌పై నెగ్గిన ఆస్ట్రేలియా కప్పు అందుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.