దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. మొదటి టెస్టులో రెండు సెంచరీలతో సత్తాచాటిన హిట్‌మ్యాన్.. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ ద్విశతకంతో మెరిశాడు. అతడికి సహకరించిన రహానే.. సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఓవర్‌నైట్ స్కోర్ 224 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు రోహిత్-రహానే జోడీ మంచి ఆరంభాన్నించింది. వీరిద్దరూ పరుగులు సాధించడమే లక్ష్యంగా ఆడారు. రహానే సెంచరీ (115) చేసి పెవిలియన్ చేరాడు. ఫలితంగా నాలుగో వికెట్‌కు నెలకొల్పిన 267 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలోనే డబుల్ సెంచరీ సాధించి జోరుమీద కనిపించిన రోహిత్ శర్మ 212 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. జడేజా అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 497/9 వద్ద డిక్లేర్ ప్రకటించాడు కెప్టెన్ కోహ్లీ.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీలు.. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయారు. ఎల్గర్ (2), డికాక్ (4) తొందరగానే పెవిలియన్ చేరారు. వెలుతురు ఆటంకం కలిగించిన కారణంగా రెండో రోజు ఆటను ముందుగానే నిలిపివేశారు అంపైర్లు. అప్పటికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 9 పరుగులు చేసింది. జుబైర్, డుప్లెసిస్ క్రీజులో ఉన్నారు.
ఇవీ చూడండి.. ఇన్‌స్టా ఆదాయంలో రొనాల్డో టాప్.. కోహ్లీది ఎంతంటే!