శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలాడు. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ ప్రకారం అతడిని మూడు నిబంధనలను ఉల్లంఘించినట్టు స్వతంత్ర ట్రైబ్యునల్ గురువారం నిర్ధరించింది.
2019 నవంబర్‌లో లోకుహెట్టిగేపై ఈ కేసు నమోదైంది. 2017లో యూఏఈలో జరిగిన టీ20 టోర్నమెంట్లో అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విచారణ చేపట్టిన స్వతంత్ర ట్రిబ్యునల్ అతడిని దోషిగా తేల్చినట్లు గురువారం ఐసీసీ ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చూడండి: ప్రపంచకప్ 'ఫిక్సింగ్' ఆరోపణలపై ప్రభుత్వం విచారణ