భారత్-శ్రీలంక మధ్య పుణె వేదికగా మూడో టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండోర్ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన బుమ్రా తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని అతను భావిస్తున్నాడు. అటు, పేసర్లు శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ అద్భుతంగా రాణించారు. శార్దూల్ డెత్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. సైనీ కూడా మంచి ప్రదర్శన చేశాడు. ప్రపంచకప్ వరకూ ఇలాగే రాణిస్తే టీమిండియా పేస్ బౌలింగ్‌కు ఎదురుండదు. శ్రీలంక జట్టులో ఎక్కువ మంది ఎడమ చేతి వాటం ఆటగాళ్లు ఉండడం వల్ల కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్‌లో రెండో ఓపెనర్ స్థానం కోసం కేఎల్ రాహుల్, ధావన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురు మాజీలు రాహుల్ వైపు మొగ్గుచూపుతున్నారు. రాహుల్ కూడా కొంత కాలంగా నిలకడైన ఆటతీరుతో ధావన్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగాడు. వెస్టిండీస్ సిరీస్‌లో చెలరేగిన రాహుల్ శ్రీలంకతో రెండో టీ20లోనూ అదరగొట్టాడు. రోహిత్ శర్మ జట్టులోకి వస్తే ధావన్‌ను ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పక్కనపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జట్టును చాలా కాలంగా వేధించిన నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కుదురుకున్నట్లు కనిపిస్తున్నాడు. అయితే ఇండోర్ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ నాలుగో స్థానంలో వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు. జట్టుకు అవసరమైన సమయంలో బాధ్యత తీసుకోవాలని అయ్యర్‌ను మూడో స్థానంలో పంపించామంటూ కోహ్లీ చెప్పాడు. అయితే, వన్డే ప్రపంచకప్‌లో ఇబ్బందిగా మారిన ఆ స్థానంపై దృష్టి సారించేందుకే యాజమాన్యం ఈ తరహా ప్రయోగాలను చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
In Action 📸📸
— BCCI (@BCCI) January 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Bowlers going full tilt ahead of the final T20I in Pune 💪#TeamIndia #INDvSL @Paytm pic.twitter.com/4ufGEXsNAN
">In Action 📸📸
— BCCI (@BCCI) January 9, 2020
Bowlers going full tilt ahead of the final T20I in Pune 💪#TeamIndia #INDvSL @Paytm pic.twitter.com/4ufGEXsNANIn Action 📸📸
— BCCI (@BCCI) January 9, 2020
Bowlers going full tilt ahead of the final T20I in Pune 💪#TeamIndia #INDvSL @Paytm pic.twitter.com/4ufGEXsNAN
కొంతకాలంగా బ్యాకప్‌కే పరిమితమైన సంజూ శాంసన్, మనీశ్ పాండేలకు ఈ మ్యాచ్‌లోనైనా అవకాశం వస్తుందో లేదో చూడాలి. మనీశ్ పాండే గత మూడు సిరీస్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లో ఆడగా.. శాంసన్‌కు అసలు అవకాశమే రాలేదు. ప్రపంచకప్‌కు ఎంపిక చేసే భారత జట్టు కోసం అందరినీ పరీక్షిస్తున్న జట్టు యాజమాన్యం వీరిద్దరికీ ఎప్పుడు అవకాశమిస్తుందో అన్నది తేలాల్సి ఉంది. ఈ సిరీస్ తర్వాత కఠినమైన సిరీస్‌లు ఉండడం వల్ల మూడో టీ20లో ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా తిరిగి వస్తే శివమ్ దూబే బ్యాకప్‌కే పరిమితం కాక తప్పదు.
భారత్‌ను నిలువరించాలంటే శ్రీలంక ఆటగాళ్లు చాలా శ్రమపడాల్సి ఉంది. ఇండోర్ మ్యాచ్‌లో శుభారంభం దక్కినప్పటికీ దాన్ని భారీ స్కోరుగా మలచడంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ ఇసురు ఉదానా గాయం కారణంగా వెనుదిరగడం లంకకు ఇబ్బందికర పరిణామం. రెండో మ్యాచ్‌లోనూ ఆడని సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను మూడో మ్యాచ్‌కు తీసుకొనే అవకాశం ఉంది.
ఇవీ చూడండి.. టీ20ల్లో బుమ్రాను ఊరిస్తున్న మరో రికార్డు