క్వారంటైన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు భారత సారథి విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్తో కొద్ది రోజుల్లో టెస్టు సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. హోటల్ గదిలోనే చెమటలు చిందిస్తున్నాడు. ఈ మేరకు తన వర్క్ఔట్స్కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"క్వారంటైన్లో కావాల్సిందల్లా మంచి సంగీతం, జిమ్ పరికరాలు. మీరు నిజంగా వర్క్ఔట్స్ చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా."
-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్
భారత బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్ కూడా తాను చేస్తున్న కసరత్తుల ఫొటోలను శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు.
ఫిబ్రవరి 5న మొదలయ్యే తొలి టెస్టు కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లాండ్ జట్లు చెన్నైలో క్వారంటైన్లో ఉన్నాయి. మంగళవారం ట్రైనింగ్ ప్రారంభమవుతుంది.
ఇదీ చూడండి: భారత్-ఇంగ్లాండ్ సిరీస్.. టాప్-3లో ఎవరు బెస్ట్?