ETV Bharat / sports

సచిన్ సరసన విరాట్​.. సొంతగడ్డపై 10వేల రన్స్​

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ తెందూల్కర్​ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్​మెన్​ కోహ్లీనే.

IND vs ENG: Virat Kohli breaks Tendulkar's, Ponting's record in 1st ODI
సచిన్ సరసన విరాట్​.. సొంతగడ్డపై 10వేల రన్స్​
author img

By

Published : Mar 23, 2021, 8:39 PM IST

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పుణె వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి మ్యాచ్​లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్​ కోహ్లీ. మొత్తంగా ఆరో బ్యాట్స్​మెన్​. ఈ ఫీట్​ సాధించడానికి ఆసీస్​ మాజీ సారథి పాంటింగ్​కు 219 ఇన్నింగ్స్​లు అవసరమయ్యాయి. విరాట్​ 195 ఇన్నింగ్స్​ల్లోనే ఈ రికార్డు చేరుకోవడం విశేషం.

అంతకుముందు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ ఈ ఫీట్​ను అందుకున్నాడు. ఆసీస్​ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్​ జాక్వస్​ కల్లిస్​​, శ్రీలంక ఆటగాళ్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ​

సొంతగడ్డపై రికార్డులు

సచిన్​ తెందూల్కర్​ - 14,192

రికీ పాంటింగ్ - 13,117

జాక్వస్​ కల్లిస్ - 12,305

కుమార సంగక్కర - 12,043

మహేల జయవర్ధనే - 11,679

విరాట్ కోహ్లీ - 10,002

ఇదీ చదవండి: తొలి వన్డే: రోహిత్​-శ్రేయస్​కు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.