ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. కోహ్లీ 77 పరుగులతో అజేయంగా నిలిచినా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి మద్దతు కరవైంది. ఫలితంగా 156 పరుగులకే పరిమితమైంది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. కాగా, ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.
- విరాట్ కోహ్లీ అర్ధసెంచరీ చేసిన టీ20లో టీమ్ఇండియా ఓడిపోవడం ఇది ఎనిమిదోసారి. ఇప్పటివరకు టీ20ల్లో అర్ధసెంచరీ చేసినా.. జట్టు ఓడిపోయిన సందర్భాలు (8) దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ పేరు మీద ఉండగా.. తాజాగా ఈ రికార్డును సమం చేశాడు కోహ్లీ.
- టీ20 ఫార్మాట్లో టీమ్ఇండియాను 9సార్లు ఓడించింది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా కూడా 9సార్లు ఓడించింది.
- అర్ధశతకంతో నాటౌట్‌గా నిలవడంలో రికార్డు సృష్టించాడు కోహ్లీ. ఇప్పటివరకు ఇతడు 50సార్లు అర్ధశతకానికి పైగా పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. సచిన్ తెందూల్కర్ 49సార్లు నాటౌట్‌గా ఉన్న రికార్డును తిరగరాశాడు.
- కోహ్లీ ఐదుసార్లు జట్టు ఆటగాళ్లు 30 పరుగులు చేయడంలో విఫలమైన సందర్భంలో 75కు పైగా స్కోర్ సాధించాడు. ఇంతకుముందు జయవర్దనే 4సార్లు ఈ ఘనత సాధించాడు.
- టీ20ల్లో కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 11వ అర్ధసెంచరీ. కేన్ విలియమ్సన్ కూడా 11 హాఫ్ సెంచరీలతో ఉన్నాడు. ఫించ్ 10, మోర్గాన్ 9 అర్ధశతకాలతో కొనసాగతున్నారు.
- ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు ఇది 100వ టీ20. ఆ దేశం తరఫున 100 టీ20లు ఆడిన మొదటి క్రికెటర్ మోర్గాన్ కావడం విశేషం.