ETV Bharat / sports

స్పిన్​లో రూట్​ చెలరేగిపోతాడు: బట్లర్

ఇంగ్లాండ్​ సారథి రూట్​.. స్పిన్​ బౌలింగ్​లో చెలరేగిపోతాడని చెప్పాడు ఆ జట్టు క్రికెటర్ జోస్ బట్లర్. అతడికి డాట్​ బాల్స్​ వేయడం ఎంతో కష్టమని అన్నాడు.

author img

By

Published : Jan 30, 2021, 5:17 PM IST

Ind vs Eng: Root very hard to bowl dot balls at, has brilliant game against spin, says Buttler
స్పిన్​లో రూట్​ చెలరేగిపోతాడు: బట్లర్

ఇంగ్లాండ్​ టెస్ట్​ కెప్టెన్​ జో రూట్​కు డాట్​ బాల్స్​ వేయడం చాలా కష్టమని అన్నాడు ఆ జట్టు వికెట్​కీపర్-బ్యాట్స్​మన్​ జోస్​ బట్లర్. స్పిన్​ బౌలింగ్​లో రూట్​ చెలరేగి ఆడతాడని చెప్పాడు.

"రూట్ అద్భుత ఫామ్​లో ఉన్నాడు. స్పిన్​ను ఎదుర్కోవడంలో అతడు దిట్ట. ఎక్కువ షాట్లు ఆడి, స్ట్రైక్​ రొటేట్​ చేయగలడు. అతడికి డాట్​ బాల్స్​ వేయడం చాలా కష్టం. ఎక్కువ సేపు బ్యాటింగ్​ చేయాలనే కాంక్ష అతడిలో బలంగా ఉంటుంది. తన టెక్నిక్​ను చాలా తెలివిగా అమలు చేయగలడు. ఏడాది ఆరంభంలోనే గొప్ప ఫామ్​లో ఉండటం అతడికి కలిసొచ్చే అంశం."

- జోస్ బట్లర్, ఇంగ్లాండ్ కీపర్​.

ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్​లో ద్విశతకంతో అదరగొట్టిన రూట్​, రెండో టెస్టులో 186పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక భారత్​తో జరగబోయే సిరీస్​లో తమ బౌలర్లు​ జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్​ ఆండర్సన్ కీలకమని చెప్పాడు బట్లర్.

ఫిబ్రవరి 5న భారత్, ఇంగ్లాండ్​ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఇప్పటికే పలువురు ఇంగ్లాండ్ క్రికెటర్లు క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టగా మిగిలినవారు సహ టీమ్​ఇండియా క్వారంటైన్​లో ఉంది.

ఇదీ చూడండి: 'ఆసీస్​​ అనుభవాన్ని ఇంగ్లాండ్​పై చూపిస్తా'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.