వృద్ధిమాన్ సాహా (9), రవిచంద్రన్ అశ్విన్ (15) క్రీజులో పాతుకుపోయి టీమ్ఇండియా భారీస్కోరుకు బాటలు వేస్తారనుకుంటే నిరాశే మిగిలింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 93.1 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. 233 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీసేన 23 నిమిషాల్లోనే వెనుదిరిగింది. 25 బంతుల్లో 11 పరుగులే చేసి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. స్టార్క్ (4/53), కమిన్స్ (3/48)లు రాణించారు. చివర్లో చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
రెండో రోజు కమిన్స్ వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది భారత్. మూడో బంతికి రవిచంద్రన్ అశ్విన్ వికెట్‌కీపర్ టిమ్ పైన్ చేతికి చిక్కాడు. టెయిలెండర్లతో కలిసి సాహా జట్టు బాధ్యతలను మోస్తాడనుకుంటే తర్వాతి ఓవర్‌లోనే అతడు నిష్క్రమించాడు. స్టార్క్ వేసిన బంతిని షాట్‌కు యత్నించి వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఉమేశ్ యాదవ్ (6), షమీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. బుమ్రా (4*) నాటౌట్‌గా నిలిచాడు.