వన్డే సిరీస్ కోల్పోయినా సరే చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకొంది టీమ్ఇండియా. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు టీ20 సిరీస్కు సిద్ధమవుతోంది. కాన్బెర్రా వేదికగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలుపు కోసం ఇరుజట్లు శ్రమిస్తున్నాయి. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. నటరాజన్ ఈ మ్యాచ్ ద్వారా టీ20 అరంగేట్రం చేయబోతున్నాడు.
జట్లు
భారత్
శిఖర్ ధావన్, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), మనీశ్ పాండే, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, షమీ, నటరాజన్
ఆస్ట్రేలియా
ఫించ్, షార్ట్, వేడ్, స్మిత్, హెన్రిక్స్, మ్యాక్స్వెల్, సీన్ అబాట్, స్టార్క్, స్వెప్సన్, జంపా, హెజిల్వుడ్