సిడ్నీ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ రెండో రోజు మొదటి సెషన్లో భారత బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. ఓవర్‌నైట్ స్కోర్ 166/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. సెంచరీ వైపుగా దూసుకెళ్తున్న లబుషేన్ (91)ను బోల్తాకొట్టించాడు జడేజా. తర్వాత వేడ్(13)నూ ఔట్ చేసి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు. కాసేపటికే గ్రీన్ (0)ను వికెట్ల ముందు దొరికించుకున్నాడు బుమ్రా. స్మిత్ (76) క్రీజులో ఉన్నాడు. ఫలితంగా లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
సిడ్నీ టెస్టు: లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 249/5
సిడ్నీ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో రోజు మొదటి సెషన్ పూర్తయ్యే సమయానికి 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది ఆసీస్. స్మిత్ 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు.