ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ధావన్ (1). తర్వాత కెప్టెన్ కోహ్లీ (9) కూడా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు రాహుల్. వీరిద్దరూ మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించాక శాంసన్ (23) ఔటయ్యాడు. తర్వాత మనీష్ పాండే (2), హార్దిక్ పాండ్యా (16) విఫలమయ్యారు. ఓవైపు వికెట్లు పడుతున్నా సమయోచితంగా ఆడిన రాహుల్ 40 బంతుల్లో 51 పరుగులు చేసి వెనుదిరిగాడు. చివర్లో జడేజా (44) పోరాటంతో కోహ్లీసేన 161 పరుగులు సాధించింది.
మెరిసిన రాహుల్.. ఆస్ట్రేలియా లక్ష్యం 162 - భారత్-ఆస్ట్రేలియా టీ20
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (51) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.