ETV Bharat / sports

సిడ్నీ టెస్టు: విఫలమైన భారత్.. ఆధిక్యంలో ఆసీస్ - IND vs AUS Sydney test updates

టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిపత్యం వహించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి ప్రస్తుతానికి 197 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

IND vs AUS
సిడ్నీ టెస్టు: ఆధిక్యంలో ఆసీస్..
author img

By

Published : Jan 9, 2021, 12:52 PM IST

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 103/2 స్కోర్‌తో‌ నిలిచింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 94ని కలుపుకొని మొత్తం 197 ఆధిక్యంలో దూసుకుపోతోంది. లబుషేన్‌(47), స్మిత్‌(29) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో టీమ్‌ఇండియాను 244 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియాకు రెండో ఇన్నింగ్స్‌లో శుభారంభం దక్కలేదు. సిరాజ్‌ మరోసారి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ పడగొట్టి భారత శిబిరంలో సంతోషం నింపాడు. పకోస్కి(10)ని స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ పంపాడు. ఆపై అశ్విన్‌ కూడా వార్నర్‌(13)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం వల్ల కంగారూలు 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు. ఆపై లబుషేన్‌, స్మిత్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ 68 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.