విదేశీ గడ్డపై భారత్ మరోసారి తేలిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది టీమిండియా. కోహ్లీ సేన విధించిన 132 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది కివీస్. ఓపెనర్లు టామ్ బ్లండెల్(55), లాథమ్(52) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిరువురూ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
తొలుత లాథమ్ ఉమేశ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 5 పరుగులే చేసిన కెప్టెన్ విలియమ్సన్తో పాటు బ్లండెల్‌ను పెవిలియన్ పంపాడు బుమ్రా. అనంతరం.. టేలర్(5), నికోల్స్(5) లాంఛనాన్ని పూర్తి చేశారు. సిరీస్ న్యూజిలాండ్ వశమైంది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం విశేషం.
-
Bumrah showing some late fight for 🇮🇳
— ICC (@ICC) March 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
He gets Williamson with a ripping short delivery, and then cleans up Blundell with another peach!
🇳🇿 being made to work for the winning runs.#NZvIND pic.twitter.com/71XLe4H7Xq
">Bumrah showing some late fight for 🇮🇳
— ICC (@ICC) March 2, 2020
He gets Williamson with a ripping short delivery, and then cleans up Blundell with another peach!
🇳🇿 being made to work for the winning runs.#NZvIND pic.twitter.com/71XLe4H7XqBumrah showing some late fight for 🇮🇳
— ICC (@ICC) March 2, 2020
He gets Williamson with a ripping short delivery, and then cleans up Blundell with another peach!
🇳🇿 being made to work for the winning runs.#NZvIND pic.twitter.com/71XLe4H7Xq
వికెట్లు టపా టపా..
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 90/6 తో మూడోరోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. 10 ఓవర్లలోపే కథ ముగిసింది. 124 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని న్యూజిలాండ్ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పుజారా(24) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు ఎక్స్ట్రా(21)లదే కావడం గమనార్హం. జడేజా(16), కోహ్లీ(14), పృథ్వీ షా(14) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4, సౌథీ 3 వికెట్లతో చెలరేగారు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు చేయగా.. కివీస్ 235 పరుగులకు ఆలౌటైంది.
భారత్‌కు తొలి సిరీస్ ఓటమి..
కివీస్ గడ్డపై తొలుత ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌కు.. వన్డే, టెస్టు సిరీస్‌ల్లో అదే ఫలితాన్ని రుచి చూపించింది విలియమ్సన్ సేన. ఫలితంగా టెస్టు ఛాంపియన్ షిప్లో భారత్‌కు తొలి సిరీస్ ఓటమి ఎదురైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది న్యూజిలాండ్.