ETV Bharat / sports

ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లాండ్​ వన్డే సిరీస్​ - ఇండియా-ఇంగ్లాండ్​ వన్డే సిరీస్​

ఇంగ్లాండ్​తో జరగనున్న వన్డే సిరీస్​కు.. అభిమానులకు అనుమతి నిరాకరించింది బీసీసీఐ. కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

in vs eng odi series to be played behind closed doors
ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లాండ్​ వన్డే సిరీస్​
author img

By

Published : Feb 27, 2021, 7:44 PM IST

Updated : Feb 27, 2021, 9:54 PM IST

స్వదేశంలో ఇంగ్లాండ్​తో తలపెట్టిన మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​కు ప్రేక్షకులకు అనుమతి నిరాకరిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది.

'రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా.. సీఎం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో వన్డే సిరీస్​కు అభిమానులను అనుమతించట్లేదు' అని మహారాష్ట్ర క్రికెట్​ అసోసియేషన్ ప్రకటించింది.

కొవిడ్​ నేపథ్యంలో ఆటగాళ్లు తగిన నిబంధనలు తీసుకునేలా జాగ్రత్త వహించాలని సీఎం కోరారు. మార్చి 23-28 వరకు మూడు వన్డేలను మహారాష్ట్ర పుణెలోని ఎంసీఏ స్టేడియంలో నిర్వహించాల్సి ఉంది.

అన్ని మ్యాచ్​లు పుణె వేదికగా జరగాల్సి ఉండగా.. చివరి వన్డే వేదికను ముంబయికి తరలించే అవకాశాలు ఉన్నాయి. సిరీస్​ ముగియగానే ఇంగ్లాండ్​ టీం.. నేరుగా లండన్​ బయలుదేరే విధంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంి.

ఇదీ చదవండి: ఇండియా- ఇంగ్లాండ్​ చివరి టెస్టుకు బ్యాటింగ్​ పిచ్​!

Last Updated : Feb 27, 2021, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.