గతేడాది రంజీ ట్రోఫీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సౌరాష్ట్ర జట్టు.. ఈ ఏడాది విజేతగా నిలిచింది. ఫైనల్లో బంగాల్ జట్టుతో తలపడి గెలిచింది. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారా.. 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అర్ధసెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా తన బ్యాటింగ్ తీరుపై స్పందించాడు పుజారా. ఈ తరం వారు తనలాగా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా లేరని అన్నాడు.
"ఈ రోజుల్లో టెస్టు మ్యాచ్‌లు తక్కువగా జరుగుతున్నాయి. నా బ్యాటింగ్ టెస్టు క్రికెట్‌కు సరిపోతుంది. కనుకు యువ క్రీడాకారులు నా ఆటను కాపీ కొట్టలేరు. కానీ నేను షార్ట్ ఫార్మాట్లలోనూ సత్తాచాటగలను. టీవీలో నా ఆటను చాలా మంది చూసి ఉండరు. నేను పరుగులు తీయడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ నేను ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. "
- చెతేశ్వర్ పుజారా, టీమిండియా ఆటగాడు
గత 8 సీజన్లలో సౌరాష్ట్ర జట్టు మూడు సార్లు తుదిపోరుకు చేరింది. కానీ, రెండుసార్లు బంగాల్ జట్టుపై ఓడింది. ఈసారి మాత్రం విజేతగా నిలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.
ఇదీ చూడండి : ప్రపంచాన్ని ఇలా చూడటం కష్టంగా ఉంది: రోహిత్