ETV Bharat / sports

రాణించిన రాహుల్​, పంత్​.. ఇంగ్లాండ్ లక్ష్యం ​337

author img

By

Published : Mar 26, 2021, 5:31 PM IST

Updated : Mar 26, 2021, 6:05 PM IST

ఇంగ్లాండ్​తో రెండో వన్డేలో టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​ సత్తా చాటారు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది భారత్​. కేఎల్ రాహుల్​ సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ బ్యాట్స్​మెన్​ పంత్​ అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్​ కరన్, తోప్లే చెరో రెండు వికెట్లు తీశారు.

india vs england
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

పుణె వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్​ఇండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్​లో రాణించిన ఓపెనర్​ ధావన్​.. స్కోరు బోర్డులో 9 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరికాసేపటికే రోహిత్ శర్మ(25 బంతుల్లో 25) రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్(108)​.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(66)కి సహకారమందించాడు. మూడో వికెట్​కు ఈ జోడీ 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో హాఫ్​ సెంచరీ చేసిన విరాట్.. ఆదిల్ రషీద్​ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు.

In the second ODI against England at Pune, Team India scores 336 in the allotted overs
కోహ్లీ-రాహుల్ శతక భాగస్వామ్యం

రాహుల్​-పంత్​ సుడిగాలి ఇన్నింగ్స్​..

రాహుల్ సెంచరీ అభివాదం

కోహ్లీ నిష్క్రమణ అనంతరం బ్యాటింగ్​కు దిగిన రిషభ్​ పంత్​.. అప్పటికే ఊపుమీదున్న రాహుల్​కు జతకలిశాడు. నాలుగో వికెట్​కు ఈ జంట 77 బంతుల్లోనే 113 పరుగులు జోడించింది. ఈ క్రమంలో కెరీర్​లో 5వ వన్డే సెంచరీ చేశాడు రాహుల్​. కొద్ది సేపటికే టామ్ కరన్ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించి క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు.

యువ బ్యాట్స్​మెన్ రిషభ్ పంత్​ సుడిగాలి ఇన్నింగ్స్​ ఆడాడు. కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన పంత్​.. మొత్తంగా 40 బంతుల్లో 77 రన్స్ చేశాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య(35; 16 బంతుల్లో) కూడా బ్యాట్​ ఝుళిపించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

బ్యాట్​ ఝుళిపిస్తున్న పంత్

సిక్సర్లతో రెచ్చిపోయిన హార్దిక్

ఇదీ చదవండి: కోహ్లీ మరో ఫీట్​.. మూడో స్థానంలో 10వేల పరుగులు

Last Updated : Mar 26, 2021, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.