ఆస్ట్రేలియా యువ క్రికెటర్ విల్ పుకోవిస్కీ(Will Pucovski) తన సోషల్‌మీడియా ఖాతాలను డియాక్టివేట్ చేశాడు. ఇటీవలే ప్రకటించిన ఆసీస్ జట్టులో అతడికి చోటు దక్కింది. దీంతో విల్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. పలు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఇవి తనపై ప్రభావం పడే అవకాశమున్నందున వీటికి దూరంగా ఉండి ఆటపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ విల్ ఇచ్చాడు. రాబోయే సిరీస్‌లో బాగా ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు.
పుకోవిస్కీ.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ద్విశతకాలు బాది 495 పరుగులు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీ అతడిని డేవిడ్ వార్నర్‌కు జోడీగా పనికొస్తాడని రెండో ఓపెనర్‌గా ఎంపిక చేసింది. ఇతడితో పాటు కొత్తగా నలుగురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది.
టిమ్‌పైన్ సారథ్యంలోని ఆస్ట్రేలియా బృందం.. డిసెంబర్ 17 నుంచి కోహ్లీసేనతో టెస్టు సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ డే/నైట్.. డిసెంబర్ 17-21 వరకు అడిలైడ్‌లో జరుగనుంది. అనంతరం మెల్‌బోర్న్ (26-30), సిడ్నీ (2021 జనవరి 7-11), బ్రిస్బేన్ (జనవరి 15-19) ఆతిథ్యమివ్వనున్నాయి. అంతకుముందు ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడతాయి.
ఇదీ చూడండి : భారత్‌తో టెస్టులకు కొత్తగా ఐదుగురు ఆటగాళ్లు