భారత కెప్టెన్ అజింక్య రహానె.. ఫీల్డింగ్ కూర్పు అద్భుతమని అన్నాడు మాజీ సారథి సునీల్ గావస్కర్. అతడి నాయకత్వ పటిమను పొగడాలని ఉన్నా తనను తాను నియంత్రించుకుంటున్నట్లు చెప్పాడీ క్రికెట్ దిగ్గజం.
"ఇప్పుడే మనం ఓ నిర్ణయానికి రాకూడదు. రహానె సారథ్యం బాగుందని నేను అంటే.. తోటి ముంబయి ఆటగాడిని వెనకేసుకొచ్చాననే అపవాదు నాకు వస్తుంది. రెండు టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా అతడి అనుభవం ప్రస్తుత ఫీల్డింగ్ కూర్పులో ఉపయోగపడింది. బౌలింగ్‌లో రహానె ఆకట్టుకునే మార్పులు చేసినా.. బౌలర్ల నైపుణ్యం కారణంగానే అతడు గొప్పగా కనిపిస్తున్నాడు. అశ్విన్, బుమ్రా, సిరాజ్‌ల ప్రదర్శన కారణంగానే భారత్ మంచి స్థితిలో ఉంది. అశ్విన్‌ను ముందే రంగంలోకి దించడం, కొత్తగా వచ్చిన సిరాజ్‌కు రెండో సెషన్లో బంతినివ్వడం సత్ఫలితాలనిచ్చింది."
--సునీల్ గావస్కర్, మాజీ ఆటగాడు
బాక్సింగ్ డే టెస్టులో బౌలర్ల కట్టుదిట్ట ప్రదర్శనతో తొలిరోజు ఆసీస్ 195 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతోంది.
ఇదీ చూడండి: తొలిరోజు ఆట అదుర్స్.. జింక్స్‌పై ప్రశంసలు!