ETV Bharat / sports

విహారి స్థానానికి ఎసరు పెట్టిన జడేజా!

ఆసీస్​తో రెండో టెస్టు కోసం హనుమ విహారిని పక్కనపెట్టే అవకాశముంది. జడేజా పూర్తి ఫిట్​నెస్​ సాధిస్తే విహారి స్థానంలోకి ఇతడిని తీసుకుంటారని బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు.

jadeja
జడ్డూ
author img

By

Published : Dec 21, 2020, 10:23 PM IST

ఆస్ట్రేలియాతో బాక్సింగ్​ డే(రెండో) టెస్టుకు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​​ రవీంద్ర జడేజా అందుబాటులోకి రానున్నాడు. తొలి టీ20లో కంకషన్​, తొడ కండర గాయం వల్ల ఆ సిరీస్​కు దూరమయ్యాడు.​ ప్రస్తుతం అతడు కోలుకున్నట్లు తెలుస్తోంది. నెట్​ ప్రాక్టీస్​ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండో టెస్టుకు జడ్డూ అందుబాటులో ఉండనున్నాడని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు.

హనుమ విహారి స్థానానికి ఎసరు

ఒకవేళ గాయం నుంచి కోలుకుని ఫూర్తి ఫిట్​నెస్​ సాధిస్తే రెండో టెస్టులో హనుమ విహారిని పక్కన పెడతారని బీసీసీఐ ప్రతినిధి చెప్పారు. అతడి స్థానంలోనే జడ్డూను తీసుకుంటారని వెల్లడించారు. అడిలైడ్​ వేదికగా జరిగిన డే/నైట్​ టెస్టులో విహారి మంచి ప్రదర్శన చేయలేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. దీంతోపాటు ఈ టెస్టులో ఐదుగురు బౌలర్లకు అవకాశం కల్పిస్తారని చెప్పారు.

కఠిన క్వారంటైన్‌లో రోహిత్‌

సిడ్నీ టెస్టుకు ముందు రోహిత్‌ శర్మ సాధన మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం అతడు సిడ్నీలో కఠిన నిబంధనల మధ్య క్వారంటైన్‌ అయ్యాడు. వార్నర్‌, సీన్‌ అబాట్‌ను సిడ్నీ నుంచి మెల్‌బోర్న్‌కు రప్పించారు. సిడ్నీలో కొత్తగా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం. హిట్‌మ్యాన్‌ అక్కడే ఉన్నా సరే సిడ్నీలో టెస్టు జరగడంపై సీఏ కచ్చితమైన హామీ ఇవ్వడం వల్ల అతడిని వేరే చోటుకు మార్చడం లేదు. ఒకవేళ మ్యాచ్‌ మరో నగరానికి మారితే సీఏతో మాట్లాడి రోహిత్‌ను అక్కడి నుంచి మ్యాచ్‌ జరిగే చోటుకు తీసుకొస్తారు.

ఇదీ చూడండి : ఆసీస్​తో రెండో టెస్టుకు టీమ్​ఇండియాలో మార్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.