"ఎవరి కర్మకు వారే బాధ్యులు".. భారత సంప్రదాయంలో ఎక్కువ మంది ఈ సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంటారు. ఇప్పుడు ఈ 'కర్మ' అనే పదాన్ని విపులీకరించి ట్విట్టర్లో షేర్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). స్టీవ్ స్మిత్‌కు వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్న ఇంగ్లాండ్ అభిమానులను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టింది.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌కు వస్తున్నపుడు ఓ వ్యక్తి స్మిత్ ఏడుస్తున్న ఫొటోను మాస్క్‌లా ధరించి నిరసన వ్యక్తం చేశాడు. ఈ చిత్రాన్ని ఐసీసీ షేర్ చేసింది.
"కర్మ అంటే.. హిందూ, బౌద్ధ మత సంప్రదాయాల ప్రకారం మనిషి చేసిన పనులు అతడి కర్మానుసారం పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తర్వాతి జన్మకైనా.. అనుభవించే వరకు వదలదు" -ఐసీసీ ట్వీట్
-
karma [noun]
— ICC (@ICC) September 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
kar·ma | \ ˈkär-mə also ˈkər- \
Definition of karma
often capitalized : the force generated by a person's actions held in Hinduism and Buddhism to perpetuate transmigration and in its ethical consequences to determine the nature of the person's next existence. pic.twitter.com/tv2UmTd1TI
">karma [noun]
— ICC (@ICC) September 8, 2019
kar·ma | \ ˈkär-mə also ˈkər- \
Definition of karma
often capitalized : the force generated by a person's actions held in Hinduism and Buddhism to perpetuate transmigration and in its ethical consequences to determine the nature of the person's next existence. pic.twitter.com/tv2UmTd1TIkarma [noun]
— ICC (@ICC) September 8, 2019
kar·ma | \ ˈkär-mə also ˈkər- \
Definition of karma
often capitalized : the force generated by a person's actions held in Hinduism and Buddhism to perpetuate transmigration and in its ethical consequences to determine the nature of the person's next existence. pic.twitter.com/tv2UmTd1TI
ఎంతమంది ఎన్నిరకాలుగా ట్రోల్స్ చేస్తున్నప్పటికీ స్టీవ్ స్మిత్ ఏకాగ్రత మాత్రం దెబ్బతినలేదు. యాషెస్‌లో ఆడిన మూడు టెస్టుల్లోనూ అదరగొట్టి ఆసీస్‌ను ఆదుకున్నాడు. 134.20 సగటుతో 671 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు(144, 142, 211) రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.
బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రపంచకప్, యాషెస్ సిరీస్‌లో అతడిని కామెంట్ చేశారు ఇంగ్లాండ్ అభిమానులు. చీటర్ చీటర్ అంటూ దురుసుగా ప్రవర్తించారు. వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అలా అనొద్దంటూ వారిని వారించాడు.
ఇదీ చదవండి: బ్యాట్‌తో భార్య.. బంతితో భర్త.. ఒకేసారి