ETV Bharat / sports

ప్రపంచకప్: భారత్ కప్పు కొట్టాలా.. దేశమంతా చిందేయాలా - Six-time finalists Australia, first-timer Indians & an MCG date

మహిళా టీ20 ప్రపంచకప్​కు సర్వం సిద్ధమైంది. తొలిసారి ఫైనల్​ చేరి టైటిల్​ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది భారత్. ఐదోసారి ట్రోఫీ ఎగరేసుకుపోవాలని భావిస్తోంది ఆస్ట్రేలియా. ఇరుజట్ల మధ్య తుదిపోరు నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల విజయావకాశాలపై ఓ లుక్కేద్దాం.

టీ20
టీ20
author img

By

Published : Mar 8, 2020, 5:34 AM IST

మహిళా టీ20 విశ్వసంరంభానికి కొద్దిగంటలే సమయం ఉంది. ఓవైపు నాలుగు సార్లు విశ్వ విజేత ఆస్ట్రేలియా.. మరోవైపు తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టిన భారత్‌. మెల్‌బోర్న్ సాక్షిగా మహిళా టీ20లో కొత్త చరిత్ర లిఖించేందుకు హర్మన్‌ ప్రీత్‌ సేన ఉవ్విళ్లూరుతున్నాయి. ఇరుజట్ల మధ్య నేడు తుదిసమరం జరగనుంది. మధ్యాహ్నం 12.30గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలు ఓసారి పరిశీలిద్దాం.

డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మొదటి మ్యాచ్‌లోనే మట్టికరిపించి ప్రపంచకప్ వేట మొదలు పెట్టిన హర్మన్ ప్రీత్‌కౌర్‌ సేన.. మళ్లీ అదే జట్టుతో తుదిపోరుకు సిద్ధమైంది. ఫైనల్స్‌ను మైండ్‌గేమ్‌తో గెలవడం ఆసీస్‌కు వెన్నతో పెట్టిన విద్య అయితే.. ఆఖరి మెట్టుమీద ఒత్తిడికి గురవడం భారత జట్టుకు ఆనవాయతీగా వస్తోంది. కానీ ఈసారి చరిత్ర తిరగరాస్తామని హర్మన్‌ సేన అంటోంది.

టీమిండియా
టీ20 ప్రపంచకప్

భారత్‌లో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే జట్టంతా స్టార్లతో కళకళలాడుతోంది. అయితే మైదానంలో మాత్రం సారథి హర్మన్‌ ప్రీత్‌కౌర్ సహా ఓపెనర్ స్మృతి మంధాన ఈ ప్రపంచకప్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. షెఫాలీ వర్మ 4 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించింది. ప్రతిజట్టుపై మంచి ఇన్నింగ్స్‌లు ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలిమ్యాచ్‌లో.. 15 బంతుల్లో 29 బాదిన వర్మ అందులో మేగాన్ షట్ వేసిన ఒక్క ఓవర్లోనే నాలుగు ఫోర్లు కొట్టింది. షెఫాలీతో పాటు వేదకృష్ణమూర్తి, దీప్తి శర్మ, రోడ్రిగ్స్ ఫర్వాలేదనిపించారు. భాటియా కూడా అవసరాలకు తగ్గట్టుగా ఆడుతోంది. హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతి కూడా ఫైనల్‌లో ఫామ్‌లోకి వస్తే.. 150 పరుగుల మార్కు దాటొచ్చని.. అప్పుడు భారత్‌కు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.

బౌలింగ్ విషయానికి వస్తే.. ‌స్వల్ప లక్ష్యాలను కాపాడడంలో బౌలర్లదే ప్రముఖపాత్ర. పూనమ్‌ యాదవ్‌ ఆస్ట్రేలియాతో లీగ్‌ మ్యాచ్‌లో 4 వికెట్లతో చెలరేగింది. ఆమె వేసే ఫ్లైటెడ్ డెలివరీలకు ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పూనమ్‌తో పాటు శిఖాపాండే, అరుంధతిరెడ్డి, రాధా యాదవ్‌, గైక్వాడ్‌ కూడా చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు.

టీమిండియా
టీమిండియా

ఆసీస్​ది మరో తీరు

గత ఏడు ప్రపంచకప్‌లలో వరుసగా ఆరోసారి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా.. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అయితే మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆసీస్​ను గాయాలు వేధిస్తున్నాయి. పేస్‌ బౌలర్ టయ్‌లా వ్లాయ్‌మింక్‌తో పాటు స్టార్ ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ సెమీఫైనల్‌కు ముందే జట్టుకు దూరమయ్యారు. కీపర్ హేలీ లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై అర్ధసెంచరీ చేసింది. తను మళ్లీ రాణించాలని కంగారూ జట్టు కోరుకుంటోంది. ఈమెతో పాటు స్టార్ బ్యాటర్లైన మూనీ, లానింగ్‌ కూడా సత్తాచాటాలని ఆసీస్ యాజమాన్యం భావిస్తోంది.

టీమిండియా
ఆస్ట్రేలియా

ఈ మ్యాచ్‌ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుండగా.. ఆ మైదానంలో 90 వేల మంది ప్రేక్షకులకు అవకాశం ఉంది. ఇప్పటికే 75 వేలకుపైగానే టికెట్లు అమ్ముడయ్యాయి. ఇరు జట్ల అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యే అవకాశం ఉండగా.. మహిళా దినోత్సవం రోజున విశ్వమహిళా సంరంభానికి సర్వం సిద్ధమయ్యాయి.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6334146_ahar.jpg
ప్రపంచకప్ కప్ ఫైనల్ జట్ల వివరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.