ETV Bharat / sports

మార్స్​పై క్రికెట్​ గ్రౌండ్​!.. ఐసీసీ ఆసక్తికర పోస్ట్​ - నాసా రోవర్

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఇటీవలే అంగారక గ్రహంపైకి రోవర్​ను విజయవంతంగా చేర్చింది. దీని గురించి ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) సోషల్​మీడియాలో ఆసక్తికర పోస్ట్​ పెట్టింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

icc takes cricket to mars
మార్స్​పై క్రికెట్​ గ్రౌండ్​!.. ఐసీసీ ఆసక్తికర పోస్ట్​
author img

By

Published : Feb 22, 2021, 9:43 AM IST

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అరుణ గ్రహంపైకి రోవర్‌ను విజయవంతంగా చేర్చిన వేళ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చేసిన ట్వీట్‌ ఆకట్టుకుంటోంది. ప్రపంచం వెలుపల కూడా క్రికెట్‌ ఉందని తాము ఎప్పుడూ చెబుతుంటామని ఐసీసీ ట్వీట్‌ చేసింది.

అంగారక గ్రహంపై క్రికెట్‌ పిచ్‌, పక్కనే నాసా పంపిన రోవర్‌ కనిపిస్తున్న ఫొటోను ఐసీసీ తన సోషల్​మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేసింది. అంగారక గ్రహంపై టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఏం తీసుకుంటారంటూ నెటిజన్లను ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

ఇదీ చూడండి: మూడో టెస్టులో మాదే ఆధిపత్యం: క్రాలే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.