ETV Bharat / sports

ఈ రికార్డును ఎవరూ బ్రేక్​ చేయలేరేమో! - icc news

భారత దిగ్గజ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్​ పేరిట ఉన్న ఓ టెస్టు రికార్డును గుర్తు చేసుకుంది ఐసీసీ. ఈ మేరకు ఓ ఫొటోను పోస్ట్​ చేసింది. 1994 నుంచి 2014 వరకు క్రికెట్​లో కొనసాగిన మిస్టర్​ వాల్​.. ఎన్నో ఘనతలు సాధించారు.

ICC Shares interesting record held by Rahul Dravid
టెస్టుల్లో ద్రవిడ్​ పేరిట ఈ రికార్డును ఎవ్వరూ బ్రేక్​ చేయలేరేమో..?
author img

By

Published : Jul 11, 2020, 9:39 PM IST

టెస్టుల్లో అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు భారత మాజీ క్రికెటర్​, జాతీయ క్రికెట్​ అకాడమీ అధ్యక్షుడు రాహుల్​ ద్రవిడ్​. సుదీర్ఘ ఫార్మాట్​లో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్​లు ఆడారు. అంతర్జాతీయ క్రికెట్​లో ఆయన పేరిట ఉన్న ఓ రికార్డును శనివారం ట్విట్టర్​ వేదికగా షేర్​ చేసింది ఐసీసీ.

  • 3️⃣1️⃣,2️⃣5️⃣8️⃣ – Rahul Dravid has faced more balls than anyone else in Test cricket.

    No other batsman has even crossed 30,000 deliveries!

    Dravid faced an average of 190.6 balls per Test match across his career 👏#ICCHallOfFame pic.twitter.com/G4D6LWBqLV

    — ICC (@ICC) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"31,258 - టెస్టు క్రికెట్​లో రాహుల్​ ద్రవిడ్​ ఎదుర్కొన్న బంతులు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కనీసం 30వేల డెలివరీలను అందుకోలేకపోయారు. ప్రతీ టెస్టులో సగటున 190.6 బంతులు ఆడేవారు మిస్టర్​ వాల్" అని ఐసీసీ తన పోస్టులో పేర్కొంది.

ICC Shares interesting record held by Rahul Dravid
రాహుల్ ద్రవిడ్

1994 నుంచి 2012 వరకు క్రికెట్​లో కొనసాగిన ద్రవిడ్​.. 164 టెస్టులు ఆడారు. ఆయన కన్నా మరో నలుగురు టాప్​ బ్యాట్స్​మన్​ ఎక్కువ మ్యాచ్​లు ఆడినా ఎవరూ రాహుల్​ ద్రవిడ్​​ అన్ని బంతులు ఆడలేదు. మాస్టర్​ సచిన్​ తెందుల్కర్​ 200 టెస్టులు ఆడి 29,437 బంతులే ఎదుర్కొన్నారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్​ కలిస్​ 166 మ్యాచ్​లు ఆడి 28,903 బంతులు ఆడారు. విండీస్​ మాజీ ఆటగాడు ఎస్​.చంద్రపాల్​ 27,395, ఆస్ట్రేలియా మాజీ సారథి అలెన్​ బోర్డర్​ 27,072 డెలివరీలు​ ఎదుర్కొన్నారు.

ICC

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.