ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​​: తొలి రెండు స్థానాల్లో కోహ్లీ, రోహిత్​ - rankings

ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్​లో విరాట్ కోహ్లీ తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్​ విభాగంలో భారత పేసర్ బుమ్రా అగ్రస్థానాన్ని పదిల పరుచుకున్నాడు.

కోహ్లీ - రోహిత్
author img

By

Published : Jul 7, 2019, 11:11 PM IST

Updated : Jul 8, 2019, 1:59 AM IST

ఐసీసీ ర్యాంకింగ్స్​​: టాపర్లుగా కోహ్లీ, రోహిత్​

ప్రపంచకప్​లో అద్భుత ప్రదర్శన చేసిన రోహిత్, కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో తమ స్థానాలను పదిల పరుచుకున్నారు. ఈ వరల్డ్​ కప్​ టోర్నీలో ఐదు శతకాలు చేసిన హిట్ మ్యాన్​ మొదటి ర్యాంకుకు అడుగు దూరంలో నిలిచాడు.

  • ఈ మెగాటోర్నీలో వరుసగా ఐదు అర్ధశతకాలు చేసిన విరాట్ కోహ్లీ 891 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో 63.04 సగటుతో 442 పరుగులు చేశాడు విరాట్. రోహిత్ 885 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ ఆజమ్‌ మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఏడాది తర్వాత వన్డే మ్యాచ్​లు ఆడిన ఆసీస్​ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ ప్రపంచకప్​లో 638 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్న వార్నర్... తాజా ర్యాంకింగ్స్​లో ఆరో స్థానంలో నిలిచాడు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ 8వ ర్యాంకులో ఉన్నాడు.

  • బౌలింగ్​ విభాగంలో భారత పేసర్ బుమ్రా తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ప్రపంచకప్​లో 9మ్యాచ్​ల్లో బరిలోకి దిగి 17 వికెట్లు తీశాడు బుమ్రా.

న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ మూడు, దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడా నాలుగో ర్యాంక్‌లో, సఫారీ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ ఐదో స్థానంలో ఉన్నారు.

  • టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ అగ్రస్థానంలోను, భారత్‌ రెండో స్థానంలోను ఉన్నాయి.

ఇది చదవండి: WC19: అండర్-19లో నెగ్గాడు..మరి ప్రపంచకప్​లో..!

Intro:Body:

r

Conclusion:
Last Updated : Jul 8, 2019, 1:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.