అంతర్జాతీయ క్రికెట్ మండలి.. ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ 2019-20 సీజన్‌కుగానూ ఇద్దరు కొత్త అంపైర్లకు చోటిచ్చింది. మంగళవారం ప్రకటించిన ఈ జాబితాలో మైకేల్ గౌ(ఇంగ్లాండ్), జో విల్సన్(వెస్టిండీస్) ఉన్నారు. వచ్చే ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వీరు తమ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరిని ఎంపిక చేసిన సెలక్షన్ ప్యానెల్లో ఐసీసీ జనరల్ మేనేజర్ జోఫ్ ఆల్లార్డిస్, మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్, రిఫరీలు రంజన్ మదుగలే, డేవిడ్ బూన్ ఉన్నారు.
కొత్తగా ఎంపికైన వారిలో మైకేల్.. ఇప్పటివరకు 9 టెస్టులు,59 వన్డేలు, 14 టీట్వంటీలకు అంపైర్‌గా చేస్తే, విల్సన్.. 13 టెస్టులు, 63 వన్డేలు, 26 టీట్వంటీలకు అంపైర్‌గా వ్యవహరించారు. ప్యానెల్లో ఇప్పటివరకు పనిచేసి రిటైర్ అయిన ఇయాన్ గోల్డ్, రవి సుందరం స్థానాల్ని వీరిద్దరూ భర్తీ చేయనున్నారు.
ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఇప్పటికే అలీందార్, కుమార ధర్మసేన, ఎరస్మస్, క్రిస్ గఫ్ఫనే, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటల్‌బరో, నీగెల్ లాంగ్, బ్రూస్ ఆక్స్న్ఫోర్డ్, పాల్ రీఫిల్, రాడ్ టకర్ ఉన్నారు.
ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీల జాబితాలో మార్పులేమి జరగలేదు. డేవిడ్ బూన్, క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రో, రంజన్ మదుగలే, ఆండీ పైక్రాఫ్ట్, రిచ్ రిచర్డ్సన్, జవగళ్ శ్రీకాంత్ ఉన్నారు.
ఇది చదవండి: ప్రపంచకప్ ఫైనల్లో ఆ ఆరు పరుగులు అంపైర్ల తప్పిదమేనన్న సైమన్ టాఫెల్