ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు కుదేలైపోయింది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండటంపై స్పందించిన ఐసీసీ.. జూన్ వరకు ఉన్న పలు క్వాలిఫయింగ్ మ్యాచ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని వాయిదా వేసింది. ఆస్ట్రేలియాలో జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్ గురించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పింది. ఈ విషయంలో ఆటగాళ్లు, అభిమానుల భద్రతే తమకు తొలి ప్రాధాన్యమంది.
- ప్రస్తుతం వాయిదా వేసిన ఐసీసీ ఈవెంట్స్
- ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ ఏ(కువైట్)- ఏప్రిల్ 16-21
- ఐసీసీ పురుషులు టీ20 ప్రపంచకప్ ప్రాంతీయ క్వాలిఫయర్(దక్షిణాఫ్రికా)-ఏప్రిల్ 27-మే 3
- ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ ఏ(స్పెయిన్)-మే 16-22
- ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ సీ(బెల్జియం)- జూన్ 10-16
- ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ బీ(మలేసియా)-జూన్ 26-జులై 2
- ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ బీ(ఫిన్లాండ్)-జూన్ 24-30
దీనితో పాటే 2023 వన్డే ప్రపంచకప్ అర్హత మ్యాచ్లు వాయిదా పడ్డాయి. భారత్లో జరిగే ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణపైనా సందిగ్ధం నెలకొంది. ఆసియా కప్(టీ20) జరిగేది లేనిది సందేహాలు వ్యక్తమవుతున్నాయి.