2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్పుల్లో భాగమయ్యాడు యువరాజ్ సింగ్. ప్రస్తుతం ఫామ్ లేమితో భారత జట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అర్ధశతకం చేసి ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా రిటైర్మెంట్తో పాటు పలు విషయాలు పంచుకున్నాడు.
ఆటకు వీడ్కోలు పలికే ఆలోచన వస్తే ముందు తానే తప్పుకుంటానని తెలిపాడు యువరాజ్. రెండేళ్లుగా తన కెరీర్ ఒడుదొడుకుల్లో ఉందని అన్నాడు. రిటైర్మెంట్ గురించి ప్రస్తుతం ఆలోచించట్లేదని చెప్పాడు ఈ 37 ఏళ్ల క్రికెటర్.
"ప్రస్తుతం ఆటను ఆస్వాదిస్తున్నా. జాతీయ జట్టులోకి రావడం గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి పరిస్థితినే సచిన్ ఎదుర్కొన్నాడు. అతడితో మాట్లాడితే కొంచెం మనసు తేలిక పడుతుంది"
యువరాజ్ సింగ్, క్రికెటర్
పంత్ ఓ అద్భుతం
యువ క్రికెటర్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడీ లెఫ్ట్ హ్యాండర్. పంత్ అద్భుత ఆటగాడని ఇలాగే ఆడితే భారత క్రికెట్లో ఓ మంచి క్రికెటర్‌గా ఎదుగుతాడని అన్నాడు. ప్రపంచకప్ జట్టులో రిషభ్‌కి అవకాశం వస్తుందో లేదో తెలియదు.. కానీ ఈరోజు చాలా బాగా ఆడాడని యవరాజ్ ప్రశంసించాడు.
- ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 78 పరుగులు చేసిన పంత్... దిల్లీ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
రోహిత్, డికాక్, పొలార్డ్ త్వరగా ఔటవడం ఓటమికి ప్రధాన కారణమని యువీ అన్నాడు. దీంతో భాగస్వామ్యాలు నెలకొల్పడం కష్టంగా మారిందని తెలిపాడు. దిల్లీ బౌలింగ్ బాగుందని కితాబిచ్చాడు.
ఇవీ చూడండి..చివరి నిమిషాల్లో అనూహ్య గోల్..చేజారిన మ్యాచ్