ETV Bharat / sports

ధోనీ తన వీడ్కోలు మ్యాచ్ ఆడేశాడు: ఆకాశ్

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ... టీ20 ప్రపంచకప్​లో స్థానం సంపాదించడంపై సందిగ్ధం నెలకొంది. అయితే ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు ఆకాశ్​ చోప్రా స్పందించాడు. ప్రపంచకప్​లో కివీస్​తో సెమీఫైనల్​ ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్​గా అభిప్రాయం వ్యక్తం చేశాడు.​

I Think MS Dhoni played his last match for India in World Cup vs New Zealand: Aakash Chopra
ధోని చివరి అంతర్జాతీయ మ్యాచ్​ అదే!
author img

By

Published : Apr 14, 2020, 5:27 AM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్​లో ఇకపై ఆడే అవకాశం ఉండదేమోనని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా. ధోనీ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. గతేడాది ప్రపంచకప్​ సెమీస్​ మ్యాచ్​ ధోనీ కెరీర్​లో చివరి అంతర్జాతీయ మ్యాచ్​ అని ఆకాశ్​ అభివర్ణించాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్​ క్రికెటర్​ రమీజ్​ రాజాతో జరిపిన యూట్యూబ్​ సమావేశంలో ప్రస్తావించాడు.

అదే వీడ్కోలు కావొచ్చు

అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్​ తుది జట్టులో ధోనీని తీసుకోవడానికి మేనేజ్​మెంట్​​, భారతీయ క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆసక్తి చూపిస్తే.. మహీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయన్నాడు. అంతేకాకుండా మిస్టర్​ కూల్​.. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వీడ్కోలు పలికే అవకాశముందన్నాడు.

ప్రపంచకప్​ తర్వాత విరామం తీసుకోవటం వల్ల ఇప్పటికే జరిగిన అనేక టోర్నీల్లో స్థానం కోల్పోయాడు మహీ. మరోవైపు ఐపీఎల్​ ద్వారా రీఎంట్రీ ఇస్తే.. తన ఫామ్​ ఆధారంగా జట్టులో చోటిస్తామని ప్రకటించాడు టీమ్​ఇండియా ప్రధానకోచ్​ రవిశాస్త్రి. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా ఐపీఎల్​ 2020 వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ పునరాగమనం కష్టమేనని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి.. స్టెయిన్ ఎదుర్కొన్న ఉత్తమ బ్యాట్స్​మెన్ వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.