ETV Bharat / sports

'సిరీస్​ పూర్తయ్యాకే పృథ్వీకి సూచనలిస్తా' - జో బర్న్స్​ పృథ్వీషా

ఆస్ట్రేలియాతో జరిగిన తొలిటెస్టులో టీమ్​ఇండియా ఓపెనర్​ పృథ్వీషా బ్యాటింగ్​ వైఫల్యంపై ఆసీస్ ఓపెనర్​ జో బర్న్స్​ స్పందించాడు. పృథ్వీకి బ్యాటింగ్​లో సలహా ఇవ్వాలనుకున్నా.. తాను ప్రత్యర్థి జట్టు కాబట్టి అలాంటి పనిచేయలేనని అన్నాడు.

'I haven't been following him' - Joe Burns on his advice for Prithvi Shaw
'సిరీస్​ పూర్తయ్యాకే పృథ్వీషాకు టిప్స్​ చెబుతా'
author img

By

Published : Dec 21, 2020, 11:03 AM IST

టీమ్​ఇండియాతో జరిగిన తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా ఓపెనర్​ జో బర్న్స్​.. అర్ధశతకంతో అలరించాడు. తాజాగా అదే మ్యాచ్​లో భారత ఓపెనర్​ పృథ్వీషా వైఫల్యంపై స్పందించాడు బర్న్స్. భారత ఓపెనర్​ పృథ్వీషా బ్యాటింగ్​లో నిలకడ కోసం పోరాడుతున్నా.. తన ప్రత్యర్థి జట్టు కాబట్టి తాను ఎలాంటి సలహా ఇవ్వలేనని అన్నాడు.

"నేను అతడి ప్రత్యర్థి జట్టులో ఆడుతున్న కారణంగా అతడికి ఎటువంటి సలహా ఇవ్వను. అతను ఈ సిరీస్​లో పరుగులేమీ చేయలేడని నేను ఆశిస్తున్నా. అతడు ఫామ్​లో ఉన్నాడో లేదో నాకు తెలియదు. కానీ, నేను అతడిని అనుసరించను. టీమ్​ఇండియా తరపున ఆడుతున్నాడు కాబట్టి.. అతను నాణ్యమైన ఆటగాడే. సిరీస్​ పూర్తైన తర్వాత అతడికి సలహా ఇస్తా. మధ్యలో నేను ఎలాంటి సూచనలు ఇవ్వలేను".

- జో బర్న్స్​, ఆస్ట్రేలియా ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​

తిరిగి ఫామ్​లోకి రావడంపై స్పందించిన జో బర్న్స్​ .. తాను బ్యాటింగ్​లో లయను అందుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించాడు. టీమ్​ఇండియాతో తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 90 పరుగులను ఛేదించాల్సిన క్రమంలో హాఫ్​సెంచరీ చేసి తమ జట్టు విజయానికి సహకరించాడు బర్న్స్​.

ఇదీ చూడండి: ఆసీస్​తో సిరీస్​లో టీమ్ఇండియా ముందున్న సవాళ్లివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.