ETV Bharat / sports

'టీమ్​ఇండియా గెలుస్తుంది.. కోహ్లీతో అదే చెప్పా' - ఆస్ట్రేలియా-భారత్​ సిరీస్​

ఆస్ట్రేలియాతో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్​లో టీమ్​ఇండియా విజయం సాధిస్తుందని చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ఇదే విషయమై కెప్టెన్ కోహ్లీతో చర్చించినట్లు తెలిపాడు.

kohli
గంగూలీ, కోహ్లీ
author img

By

Published : Jul 14, 2020, 1:16 PM IST

ఈ ఏడాది చివర్లోని ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ నేతృత్వంలోని టీమ్​ఇండియా తప్పకుండా విజయం సాధిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ఇదే విషయంపై అతడితో మాట్లాడినట్లు తెలిపాడు.

"కోహ్లీకి క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంది. మరింత బాగా ఆడేందుకు సంసిద్ధంగా ఉండేలా శ్రమించాలని అతడికి సూచించాను. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్​లో టీమ్​ఇండియాను గెలుస్తుందని భావిస్తున్నాను. ఇదే విషయమై అతడితోనూ మాట్లాడాను"

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

జట్టు ఫిట్​నెస్​ గురించి ఎప్పటికప్పుడు కోహ్లీతో చర్చిస్తున్నట్లు చెప్పాడు గంగూలీ. ఈ టూర్​లో భాగంగా భారత్​-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు జరగనున్నాయి. అక్టోబరు నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది.

2018-19లో ఆసీస్​తో జరిగిన సిరీస్​ను 2-1తేడాతో టీమ్​ఇండియా గెలుచుకుంది. 71 ఏళ్ల చరిత్రలో కంగారూ గడ్డపై విజయం సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది.

ఇది చూడండి : 2020ని కాలితో తంతాను: ఇర్ఫాన్​ పఠాన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.