ETV Bharat / sports

రూ.15 కోట్లంటే ఎంతో తెలీదు: జేమిసన్‌

రూ.15 కోట్లంటే న్యూజిలాండ్​ కరెన్సీలో ఎంత విలువ చేస్తుందో తెలియదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు న్యూజిలాండ్ యువ పేసర్ జేమిసన్. గురువారం జరిగిన మినీ వేలంలో రూ.15 కోట్లు వెచ్చించి జేమిసన్​ను సొంతం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌తో కలిసి ఆడబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు.

Jamieson comments
రూ.15 కోట్లంటే ఎంతో తెలీదు: జేమీసన్‌
author img

By

Published : Feb 19, 2021, 8:32 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో కివీస్‌ యువపేసర్‌ కైల్‌ జేమిసన్‌ పంట పండింది. అతడిని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే న్యూజిలాండ్‌ కరెన్సీలో రూ.15 కోట్లంటే ఎంతో తెలియదని జేమిసన్‌ అంటున్నాడు.

కివీస్‌ క్రికెటర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇప్పటి వరకు జేమిసన్‌ ఒక్కడే. ఇక ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన నాలుగో ఆటగాడు అతడే. అమెరికా డాలర్లలో రూ.15 కోట్ల విలువ 20 లక్షల డాలర్లకు సమానం కావడం గమనార్హం.

'నేను అర్ధరాత్రి లేచాను. ఫోన్లు ఏమైనా వస్తాయేమో చూద్దామనుకున్నా. పరిస్థితి తప్పించుకోలేమని తెలిసి హాయిగా కూర్చొని ఆస్వాదిద్దామనుకున్నా. నా పేరు వేలానికి ఎప్పుడొస్తుందా అని గంటన్నర కష్టంగా ఎదురుచూశాను' అని జేమిసన్‌ అన్నాడు. 'అంతలోనే ఇదెంత బాగా సాగుతోందో కదా అని షేన్‌బాండ్‌ నుంచి సందేశం వచ్చింది' అని తెలిపాడు.

'నిజానికి అదెంత డబ్బో (రూ.15 కోట్లు), న్యూజిలాండ్‌ డాలర్లలోకి ఎలా బదిలీ చేస్తారో నాకైతే తెలియదు. ఏదేమైనా ఆ సందర్భాన్ని రెండు మూడు నిమిషాలు బాండ్‌తో పంచుకోవడం బాగుంది' అని జేమిసన్‌ అన్నాడు. న్యూజిలాండ్‌ జట్టు సభ్యులు పార్టీ అడిగితే ఏం చేస్తావని ప్రశ్నించగా 'కాఫీలు కొనిస్తానని అనుకుంటున్నా. ఏమో తెలియదు. వేలం జరిగి కొన్ని గంటలే కదా అయింది. రాత్రికి రాత్రే నా బ్యాంకు ఖాతాలో సొమ్ము మారదు కదా. అందుకే కాఫీలు లేదా బీర్లు కొనిస్తా' అని అన్నాడు.

విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌తో కలిసి ఆడబోతున్నందుకు సంతోషంగా ఉందని జేమిసన్ తెలిపాడు. 'ఐపీఎల్‌ ప్రత్యేక టోర్నమెంట్‌. భారీ ఫ్రాంఛైజీలు ఉంటాయి. నేర్చుకొనేందుకు, అనుభవం సంపాదించేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. నిజానికి అదే నన్ను ఉత్సాహపరుస్తోంది. గొప్పవాళ్లతో కలిసి మ్యాచులు ఆడొచ్చు. ఇదో ప్రత్యేక సందర్భం' అని అతడు పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:'మోరిస్​ రాజస్థాన్​ జట్టుకు చాలా ప్రత్యేకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.