ETV Bharat / sports

ఎప్పటికైనా ఆర్సీబీతోనే ఉంటాను: కోహ్లీ

ఐపీఎల్​ కెరీర్​ అంతా బెంగళూరు జట్టుతోనే ఉంటానని చెప్పిన​ కోహ్లీ.. వీడాలన్న ఆలోచన కూడా రాదని తెలిపాడు. ప్రస్తుతం ఈ సీజన్​ కోసం జట్టులోని సహ ఆటగాళ్లతో ప్రాక్టీసు సెషన్​లో పాల్గొన్నాడు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Sep 5, 2020, 9:08 AM IST

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టును వీడాలన్న ఆలోచనే తనకు రాదని, ఎప్పటికీ ఈ జట్టుతోనే ఉంటానని విరాట్‌ కోహ్లీ అన్నాడు.

"పన్నెండేళ్లుగా ఆడుతున్నా. ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది. నమ్మశక్యంగా అనిపించట్లేదు. మేం మూడుసార్లు ట్రోఫీకి చేరువగా వెళ్లాం. కానీ సాధించలేకపోయాం. కప్పు మా అందరి కల. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఈ జట్టును వీడాలనే ఆలోచన నాకు రాదు. ఆ అవకాశమే లేదు. ఫ్రాంఛైజీ నాపై చూపించిన ఆపేక్షే ఆందుకు కారణం. మా ఆట ఎలా ఉన్నా సరే.. నేను ఐపీఎల్‌ ఆడేంత వరకు బెంగళూరుతోనే ఉంటా"

- కోహ్లీ, ఆర్సీబీ సారథి.

తొలి ఐపీఎల్‌ (2008) నుంచి అతడు బెంగళూరుతోనే ఉన్నాడు. ఈ మెగాలీగ్​లో ఆరంభం నుంచి ఇప్పటివరకు ఒకే జట్టుతో ఉన్న ఏకైక ఆటగాడు విరాట్‌ కోహ్లీనే. బ్యాట్స్‌మన్‌గా విశేషంగా రాణించినా అతడి కప్పు కల మాత్రం నెరవేరలేదు. బెంగళూరు రెండు సార్లు (2009, 2016)లో రన్నరప్‌గా నిలిచింది. దుబాయ్​ వేదికగా ఈ సీజన్​ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో జరగనుంది.

ఇదీ చూడండి యుఎస్‌ ఓపెన్‌ : ముర్రే కథ ముగిసె.. అజరెంకా ముందంజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.